AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

ఆస్కార్ రేసుకు వెళ్లిన లాపతా లేడీస్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సతేంద్ర సోని, ఆ తర్వాత తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. తాజాగా సతేంద్ర సోని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు
Satendra Soni
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2026 | 6:54 PM

Share

సినిమా నటీనటుల జీవితం మనం అనుకున్నట్టు ఉండదు.. కొందరి నటుల జీవితం ఎంతో దయనీయంగా ఉంటుంది. సినిమాల్లో ఉన్నప్పుడు ఉన్నంత విలాసవంతం సినిమా అవకాశాలు లేనప్పుడు ఉండదు. చాలా మంది నటులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు నటులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ నటుడు కూడా తనకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని, పైగా అడిగినందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఓ వీడియో విడుదల చేశాడు. ఇంతకూ ఆ నటుడు ఎవరో తెలుసా.? ఆస్కార్ రేసుకు వెళ్లిన ‘లాపతా లేడీస్’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నటించిన యువ నటుడు సతేంద్ర సోని తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు.

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే

మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సతేంజ్ర సోని మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని ఓ సినిమా షూటింగ్ లో తాను పాల్గొన్నానని.. అయితే రెమ్యునరేషన్ అడిగినందుకు తనను చంపుతామని ఆ దర్శకుడు బెదిరిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతే కాదు నడిరోడ్డు మీద తన పై దాడి చేశారని ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట

కష్టపడి పని చేసినందుకు రెమ్యునరేషన్ అడిగితే ఇలా చిత్రహింసలు పెడుతున్నారని ఎమోషనల్ అయ్యాడు సతేంజ్ర సోని. పేడ్ పాల్కి అనే సినిమా షూటింగ్ కోసం సతేంజ్ర సోని ఎంపిక చేశారు. 10 రోజుల షూటింగ్ కు గాను రూ. 50వేలు అడ్వాన్స్ ఇచ్చారు. షూటింగ్ అనంతరం మిగిలిన డబ్బులు అడగ్గా వివాదం మొదలైంది. డబ్బులు ఇవ్వకపోగా 10 నిమిషాల్లో హోటల్ ఖాళీ చేసి వెళ్లాలని లేదంటే చంపేస్తాని బెదిరించాడట దర్శకుడు పుష్పేంద్ర సింగ్. అంతే కాదు అతని భార్య ఆ సినిమా హీరోయిన్ అయిన ప్రగతి చౌహాన్ ఇష్టమొచ్చినట్టు తిట్టిందట. ఆతర్వాత వారు హోటల్ ఖాళీ చేసి వెళ్తుండగా.. ప్రగతి చౌహాన్, పుష్పేంద్ర కారులో వెంబడించి, రోడ్డు మీద పట్టుకొని విపరీతంగా కొట్టారని ఆ వీడియోలో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సతేంజ్ర సోని.

ఇది కూడా చదవండి : ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. కుర్రాళ్లు పడిచచ్చిపోతారు

సతేంజ్ర సోని వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us