AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే SUV లుక్, 22 కీలో మీటర్ల మైలేజ్.. మిడిల్ క్లాస్ కోసం బెస్ట్ బడ్జెట్ కారు! ధర ఎంతంటే?

కొత్తకారు కొనాలి అనుకుంటున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.5 నుంచి 6 లక్షలే ఉందా.. అయితే మీకో సూపర్ గుడ్‌ న్యూస్.. ఎందుకంటే ఇప్పుడు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా తన అత్యంత చౌకైన ధరతో సరికొత్త మోడల్‌ కారును మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది.జూలై 3న లాంచ్ అవ్వబోయే ఈ కారు ధర కేవలం రూ.6లక్షల లోపే ఉండొచ్చని తెలుస్తోంది. కాబట్టి దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం పదండి.

అదిరిపోయే SUV లుక్, 22 కీలో మీటర్ల మైలేజ్.. మిడిల్ క్లాస్ కోసం బెస్ట్ బడ్జెట్ కారు! ధర ఎంతంటే?
Renault Kwid Mileage 2026
Anand T
|

Updated on: Jun 28, 2026 | 6:37 PM

Share

బడ్జెట్‌లో కారు కొనాలి అనుకునే వారికి ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రముఖ కార్ల కంపెనీ రెనో ఇండియా ఇప్పుడు మార్కెట్‌లోకి తన సరికొత్త అత్యంత చవకైన కారును తీసుకురాబోతుంది. అదే రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. ఈ కారు వచ్చే నెల 3వ తేదీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీని ప్రారంభ ధర రూ.5లక్షల వరకే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ క్విడ్‌ గతంలో కంటే ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ ఇంటీరియర్ వంటి ఫీచర్లతో రాబోతుంది. కానీ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదు.

స్టైలిష్‌గా ఎక్స్‌టీరియర్

ఓల్డ్‌ మోడల్‌తో పోల్చుకుంటే ఈ కారులో ఛాలా ఛేంజెస్ చేసినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం రాబోతున్న ఈ కొత్త రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్ మొత్తం సరికొత్త లుక్‌తో రానుంది. ఇందులో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, Y-షేప్ LED DRLలతో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్‌లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొత్త డిజైన్ టెయిల్ లైట్లు, బంపర్‌ను సెట్ చేశారు. SUV స్టైల్, కాంపాక్ట్ సైజులో ఉండే ఈ కారు సిటీ డ్రైవింగ్‌కు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

బిగ్ టచ్‌స్క్రీన్, న్యూ ఫీచర్స్

ఈ కొత్త క్విడ్‌లో లోపల డిస్‌ప్లేతో పాటు పూర్తి ఇంటీరియన్‌ను ఛేంజ్ చేసినట్టు తెలుస్తోంది. AutoPundit నివేదిక ప్రకారం: ఇందులో సుమారు 10 ఇంచెస్ బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే పాటు Android Auto, Apple CarPlay సపోర్ట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, ప్రీమియం సీట్ ఫ్యాబ్రిక్ వంటి ఫీచర్లు కూడా తీసుకురావోచ్చు.

ఇంజిన్, మైలేజ్

అయితే ఈ కొత్త క్విడ్‌ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగిస్తారు. ఇందులో 5 స్పీడ్ మ్యానువ్, ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ దాదాపు 68 హార్స్‌పవర్‌తో పాటు 22 కిలో మీటర్ల వరకు మైలేజ్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉంది.

సేఫ్టీ ఫీచర్స్, ప్రైజ్

ఇక ఈ కొత్త క్విడ్‌లో సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇతర అవసరమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని ధర విషయానికి వస్తే.. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.80 లక్షల నుండి రూ. 5.50 లక్షల మధ్య ఉండవచ్చు.

ఈ కారు కొనడం మంచిదేనా?

మీ బడ్జెట్ రూ.5 లక్షలే అయి.. మీ ఇప్పుడే ఫస్ట్‌టైం కారు కొనాలి అనుకుంటే.. ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో SUV లుక్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, సిటీకి సరిపోయే ఈజీ డ్రైవింగ్, పెద్ద టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ వంటి అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us