వైష్ణవ్ తేజ్‌కు హీరోయిన్ ఫిక్స్..!
హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. నూతన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన ప్రీ-లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం మంగుళూరు బ్యూటీ కృతి శెట్టిని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈమె కథానాయకిగా పలు తమిళ మూవీస్‌తో పాటు ఓ కన్నడ […]

హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. నూతన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన ప్రీ-లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం మంగుళూరు బ్యూటీ కృతి శెట్టిని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈమె కథానాయకిగా పలు తమిళ మూవీస్‌తో పాటు ఓ కన్నడ చిత్రంలో కూడా నటించింది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం మే 25 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
