‘నా పేరు సూర్య’ తరువాత దాదాపుగా 10నెలలు గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలను లైన్‌లో పెట్టిన బన్నీ, మరో టాప్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ టాప్ డైరక్టర్ మురగదాస్‌కు అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తు్న్నాయి. సామాజిక సందేశంతో ఉండబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌లో తెరకెక్కింబోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. కాగా మురగదాస్ ప్రస్తుతం రజనీకాంత్‌తో సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
కాగా కోలీవుడ్‌లోకి బన్నీ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే ఎప్పటికైనా తమిళ్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు బన్నీ. ఇప్పుడు ఈ వార్త నిజమైతే బన్నీకి కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఉండనున్నట్లే.