తమిళనాట బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో శిలంబరసన్ అలియాస్ శింబు ఒకరు. ప్రముఖ దర్శకుడు, నటుడు టి. రాజేందర్ కుమారుడిగా వెండితెరకు పరిచయమైన తనదైన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతోన్న ఈ హీరో ఇటీవల ‘మానాడు’ తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. టైమ్ లూప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలో బాలనటుడిగా మొదలై స్టార్ హీరోగా ఎదిగిన శింబు తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు .
తమిళనాడులో ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శింబును డాక్టరేట్ తో సత్కరించింది. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. డాక్టరేట్ ప్రదానోత్సవ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులురాజేందర్, ఉష కూడా హాజరయ్యారు. డాక్టరేట్ అందుకున్న అనంతరం శింబును సంతోషంతో ముద్దాడారు తల్లిదండ్రులు. కాగా తను డాక్టరేట్ అందుకున్న ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ‘ నాకు ఇంతటి గౌరవాన్ని అందించినందుకు వేల్స్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ గౌరవాన్ని తమిళనాడుతో పాటు నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను. నా జీవితంలో సినిమా ఉందంటే దానికి కారణం వారే. అదేవిధంగా నన్ను ఎంతగానో ఆదరించిన అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడీ కోలీవుడ్ హీరో.
Thanking all the committee members of Vels University & @IshariKGanesh for bestowing the Honorary Doctorate upon me.
I dedicate this huge honour to
Tamil cinema, my Appa & Amma! Cinema happened to me because of them!
Finally – my fans, #NeengailaamaNaanilla
Nandri Iraiva! ❤️ pic.twitter.com/YIc6WyGCvR— Silambarasan TR (@SilambarasanTR_) January 11, 2022
Also Read: Coronavirus: అన్ని ప్రైవేటు ఆఫీసుల్లో వర్క్ ఫ్రమ్ హోం.. కీలక ఆదేశాలిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన భరించలేరు.. ఆ సమయంలో సింపుల్‌గా ఇలా చేయండి..
Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?