‘నీవల్లే నీవల్లే’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు వినయ్ రాయ్. ఆతర్వాత వాన సినిమాతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో హ్యాండ్సమ్ హీరోగా మెప్పించిన ఈ నటుడు ఇప్పుడు స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్), చంద్రకళ, డాక్టర్ సినిమాల్లో అతను పోషించిన విలన్ పాత్రలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నటుడు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అతనితో జీవితాన్ని పంచుకోబోయేది మరెవరో కాదు.. ఒకప్పుడు టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విమలారామన్. గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ ప్రేమ జంట తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన విమలారామన్ తొలుత మలయాళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించింది. ఆతర్వాత తెలుగులో గాయం2, చట్టం, ఎవరైనా ఎపుడైనా, నువ్వానేనా, చుక్కల్లాంటి అబ్బాయి చక్కనైన అబ్బాయి తదితర చిత్రాలు చేసింది. అందం, అభినయం పరంగా గుర్తింపు తెచ్చుకున్నా అవకాశాలు మాత్రం తెచ్చుకోలేకపోయింది. దీంతో మళ్లీ మలయాళం, కన్నడ సినిమాల్లో బిజీగా మారిపోయింది. కాగా వినయ్ రాయ్, విమలా రామన్ పలు మార్లు జంటగా మీడియా కంట కూడా పడ్డారు. టూర్లు, వెకేషన్లు ఎక్కడికెళ్లినా జంటగానే వెళ్లారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా వీరిద్దరూ త్వరలోనే ఏడడుగులు నడవనున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
Also Read:మీ పర్సు లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో ఈ వస్తువులు అస్సలు ఉంచుకోకండి.. మర్చిపోతే మీ సంగతి అంతే ఇక..