Telangana Congress: రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ..
ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 39 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణలో..
ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో(Rahul Gandhi) తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 39 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీల బలాబలాలను అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలు, చేయాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు.. ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, సెక్రటరీలు బొసరాజు, శ్రీనివాసన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, సభ్యత్వ నమోదు, ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై చర్చించారు.
ఇదిలావుంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు(VH) కు సోనియా గాంధీ అపాయింట్మెంట్ లభించింది. మరో వైపు ఈ భేటీ కంటే ముందే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశమయ్యారు సీనియర్ నేత వీహెచ్. రాష్ట్రంలో సమస్యలపై పోరాడాలని సోనియా సూచించినట్లు ఆయన ప్రకటించారు. పార్టీ వివాదాలపై బహిరంగంగా స్పందించలేనన్న వీహెచ్.. పెరిగిన పెట్రోల్, డీజిల్‌పై ఆందోళన చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వివిధ పరిణామాలను సోనియాకు వివరించేందుకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన వి.హన్మంతరావుకు సోనియా అపాయింట్ దక్కలేదు. అయితే.. తాజాగా ఆయనకు సోమవారం సాయంత్రం 5 గంటలకు సోనియా అపాయింట్ మెంట్ లభించింది.
ఇవి కూడా చదవండి: Stock Market: రంకెలేసిన బుల్.. 3 నెలల తర్వాత 30 లక్షల కోట్ల లాభం.. ఫుల్ జోష్‌లో ఇన్వెస్టర్లు ..
Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..