Folk Song : రెండు రోజుల్లోనే 7 లక్షలు వ్యూస్ .. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఫోక్ సాంగ్..
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ పేర్లు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఒక్క వీడియో ఇద్దరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించింది. నిజానికి ఈ ఇద్దరి జోడికి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరు కలిసి నటించిన ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాలు, దేశాలు దాటి ప్రపంచస్థాయిలో కోట్లలో వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. అయితే ఫోక్ సాంగ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు సైతం అందుకుంటున్నారు. ఫోక్ ప్రపంచంలో తమకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న జోడిల్లో ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఒకటి. వీరిద్దరు కలిసి నటించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఒక్కో పాట యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్ అందుకుంటూ సంచలనం సృష్టించాయి. అయితే ఒకే ఒక్క వీడియోతో ఇప్పుడు ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఇటీవల ఈశ్వర సాయి భార్య షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పటివరకు అటు ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ మౌనంగానే ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్‌లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?
ఇదిలా ఉంటే.. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటించిన రబ్బరి గాజులు అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుదలైన రెండు రోజుల్లోనే 7.21 లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది. ఈ పాటలో ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.ఈ పాటను నవీన్ ఏజే లిరిక్స్ అందించగా.. సింగర్ ప్రభ, హనుమంత్ యాదవ్ కలిసి అద్భుతంగా ఆలపించారు. కొరియోగ్రాఫర్ సోమేష్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్పులు నెట్టింట రీల్స్ గా వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ అటు సోషల్ మీడియాలోనూ తెగ వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..
పాట ప్రారంభంలో హీరో కథానాయిక అందాన్ని, నడకను, ముక్కుపుల్ల, గాజులను పొగుడుతూ “అందాల అంగడికి పోదాం, నీకు రంగుల గాజులు కొనిస్తా” అంటూ ఆమెను ప్రేమతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. దానికి నాయిక సిగ్గుపడుతూనే, తనను ఎక్కువగా కసిరిపోవద్దని, అంతగా ప్రేమ చూపించవద్దని, తన పని తాను చేసుకుంటానని చెప్తుంది. చివరకు అతని నిజమైన ప్రేమకు, పట్టుదలకు ఆకర్షితురాలై “నీ ప్రేమలో పడిపోతానురా” అంటూ అతనితో కలిసి గాజుల అంగడికి వెళ్లడానికి అంగీకరిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ అటు సోషల్ మీడియాలోనూ తెగ వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో
రబ్బరి గాజులు సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..
