మాస్ మహారాజా రవితేజ సినిమా కోసం ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఖిలాడి సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో రవితేజ డబుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. జయంతీలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. కాగా హవీష్ ప్రొడక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ముంబైలో మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు రమేష్ వర్మ ఇందులో పాల్గొంటున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి నాయకలుగా నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్, ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్, అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాక్షసుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తమది సూపర్ హిట్ కాంబినేషన్ అని స సత్య నారాయణ కోనేరు, రమేష్ వర్మ నిరూపించారు. భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక సినిమాలో రవితేజ ఫ్యాన్స్‌కి సంబంధించిన అన్ని హంగులు ఉంటాయని చెబుతున్నారు.