KGF 2 : కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఈ నెల 25న అప్‌డేట్‌ వచ్చేస్తోంది..

| Edited By: Anil kumar poka

Apr 12, 2022 | 1:33 PM

KGF 2 : యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్‌' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదల వరకు పెద్దగా ప్రచారం లేని ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా దేశం...

KGF 2 : కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఈ నెల 25న అప్‌డేట్‌ వచ్చేస్తోంది..
Kgf 2
Follow us on

KGF 2 : యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదల వరకు పెద్దగా ప్రచారం లేని ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా కన్నడ చిత్ర పరిశ్రమ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిందీ సినిమా. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో రెండో పార్ట్‌పై అందరి దృష్టి పడింది.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుస్తూ వచ్చింది. అయితే తాజాగా ఏప్రిల్‌ 14న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో చిత్ర యూనిట్‌ ఈ నిర్ణయానికి వచ్చింది. ఇక తొలి పార్ట్‌ హిందీలో కూడా మంచి టాక్‌ సొంతం చేసుకోవడంతో, బాలీవుడ్‌ తారలను కూడా ఇందులో నటింపజేశాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఇదిలా ఉంటే అప్పుడెప్పుడో విడుదలైన టీజర్‌ తప్ప.. ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు.

అయితే తాజాగా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచేందుకు చిత్ర యూనిట్‌ ఒక సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదని చెప్పాలి. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. మరి కేజీఎఫ్‌2 ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Bandi Sanjay: ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధానిపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Trains Cancelled: ఏపీ ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గంలో నడిచే రైళ్లు పాక్షికంగా రద్దు.. మరికొన్ని..

Women Workers: ఆ కంపెనీల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు..