Actress Sukrithi: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న కేరింత నటి.. నెట్టింట్లో వైరలవుతోన్న నిశ్చితార్థం ఫొటోలు..

Sukrithi Engagement: ఐదేళ్ల క్రితం సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ దివ్య మెయిన్‌ హీరోయిన్‌ అయినా మరో నటి సుకృతి (Sukrithi) తన క్యూట్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. సుకృతి అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ..

Actress Sukrithi: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న కేరింత నటి.. నెట్టింట్లో వైరలవుతోన్న నిశ్చితార్థం ఫొటోలు..
Sukrithi Engagement

Updated on: Jun 12, 2022 | 2:53 PM

Sukrithi Engagement: ఐదేళ్ల క్రితం సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ దివ్య మెయిన్‌ హీరోయిన్‌ అయినా మరో నటి సుకృతి (Sukrithi) తన క్యూట్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. సుకృతి అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆ సినిమాలో ఆమె పోషించిన భావన పాత్ర అంటే అందరూ గుర్తుపడతారు. అంతలా ప్రేక్షకుల్లోకి ఎక్కేసిందీ ఆ క్యారెక్టర్‌. అయితే వ్యక్తిగత కారణాలతో కేరింత తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదీ అందాల తార. సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ అందాల భామ పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా సుకృతికి అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఈ జంట ఇద్దరూ కలిసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందమైన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్‌ లవ్‌..
కాగా తన ఎంగేజ్‌మెంట్ సందర్భంగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది సుకృతి. నిశ్చితార్థం వేడుకలో నాన్నతో కలిసున్న ఫొటోను పంచుకుంటూ ‘నా ప్రపంచం నాన్న. భయపడినప్పుడు నా భుజం తట్టావు. నిత్యం నన్ను సంతోష పెట్టేందుకు ప్రయత్నించావ్. నా చేయి పట్టుకుని నడిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నావు. ఐదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అమ్మ ప్రేమను సైతం తానే అందించాడు. సింగిల్‌ పేరెంట్‌గా ఉండటం అంత సులభమేమీ కాదు. నాకు తెలిసిన బలమైన వ్యక్తివి నువ్వే నాన్న.. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్‌ లవ్‌ డాడీ’ అని భావోద్వేగానికి గురైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Prayagraj violence: యూపీలో మళ్లీ బుల్‌డోజర్ల హల్‌చల్‌.. అల్లర్ల మాస్టర్ మైండ్ ఇంటిని కూల్చేసిన పోలీసులు..

Meta: షెరిల్ శాండ్‌బర్గ్ పై మెటా ఇన్వెస్టిగేషన్.. కంపెనీ వనరులు వినియోగించినందుకే..

Indian Captainship: ఏడాదిలో ఆరుగురు కెప్టెన్లు.. టీమిండియాకు సారథ్యం వహించిన ప్లేయర్లు వీరే..