Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prayagraj Violence: యూపీలో మళ్లీ బుల్‌డోజర్ల హల్‌చల్‌.. అల్లర్ల మాస్టర్ మైండ్ ఇంటిని కూల్చేసిన పోలీసులు..

ప్రయాగ్‌రాజ్‌ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు జావేద్‌ పంప్‌ ఇంటిని కూల్చేశారు పోలీసులు. అక్రమంగా ఇంటిని నిర్మించినట్టు జావేద్‌పంప్‌పై ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. అయితే కూల్చివేత సందర్భంగా జావేద్‌ పంప్‌ ఇంటి ముందు హైడ్రామా చోటు..

Prayagraj Violence: యూపీలో మళ్లీ బుల్‌డోజర్ల హల్‌చల్‌.. అల్లర్ల మాస్టర్ మైండ్ ఇంటిని కూల్చేసిన పోలీసులు..
Mastermind Javeds House
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 12, 2022 | 3:15 PM

ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బుల్‌డోజర్ల హల్‌చల్‌ మొదలయ్యింది. అల్లర్లకు పాల్పడిన వాళ్లపై ఉక్కుపాదం మోపుతోంది యూపీ ప్రభుత్వం. ప్రయాగ్‌రాజ్‌ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు జావేద్‌ పంప్‌ ఇంటిని కూల్చేశారు పోలీసులు. అక్రమంగా ఇంటిని నిర్మించినట్టు జావేద్‌పంప్‌పై ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. అయితే కూల్చివేత సందర్భంగా జావేద్‌ పంప్‌ ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. నోటీసులు ఇచ్చినప్పటికి జావేద్‌ పంప్‌ తన ఇంటిని ఖాళీ చేయలేదు. దీంతో పోలీసులు సామాగ్రిని బయటకు తీసుకొచ్చారు. శనివారమే జావేద్‌ పంప్‌ ఇంటిని కూల్చేస్తామని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్‌ అల్లర్ల కేసులో జావేద్‌ పంప్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా గుర్తించారు పోలీసులు. అల్లర్లకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం యోగి. శుక్రవారం చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు 304 మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

జావేద్‌పంప్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. అయితే అల్లర్లలో మరికొంతమంది మాస్టర్‌మైండ్స్‌ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. సహ్రాన్‌పూర్‌లో కూడా అల్లర్లతో ప్రమేయం ఉన్న ఇద్దరి ఇళ్లను కూడా కూల్చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో 91 మంది, అంబేద్కర్‌నగర్‌లో 34 మంది, సహ్రాన్‌పూర్‌లో 71 మంది, హాథ్రస్‌లో 51 మంది, మురాదాబాద్‌లో 31 మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

గత నెలలోనే, PDA నోటీసులు

ఇల్లు అక్రమంగా నిర్మించబడిందని గత నెలలో జావేద్ అహ్మద్ పంప్‌కు ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ నోటీసు పంపింది. ఈ విషయంలో పీడీఏ కూడా ఆయన సమాధానం కోరింది. పంప్ హౌస్‌ను అక్రమ భవనంగా ప్రకటిస్తూ మే 25న పీడీఏ జావేద్‌ అహ్మద్‌కు ఉత్తర్వులు పంపింది. దీని తర్వాత మరోసారి జూన్ 12న జావేద్ అహ్మద్ పంప్ ఇంటిని కూల్చివేయాలని పీడీఏ నోటీసులు అంటించింది. ఉదయం 11 గంటలలోగా ఈ ఇల్లు ఖాళీ చేయాలని కూల్చివేసేందుకు బుల్ డోజర్ కు పని చెప్పాల్సి ఉంటుదని నోటీసులో పేర్కొన్నారు.