Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బురఖా ధరించి సాదాసీదాగా వచ్చిన మహిళ.. ఆ తర్వాత ఆమె చేసిన పనికి అందరూ షాక్

ఉత్తర్​ప్రదేశ్ గోరఖ్​పుర్‌లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఏదో పని ఉన్నట్లు బురఖా ధరించి ఓ ప్రాంతానికి వచ్చిన మహిళ.. ఊహించని పని చేసింది.

Viral: బురఖా ధరించి సాదాసీదాగా వచ్చిన మహిళ.. ఆ తర్వాత ఆమె చేసిన పనికి అందరూ షాక్
Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2022 | 2:55 PM

Uttar Pradesh: ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​(Gorakhpur)లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. బురఖా ధరించిన ఓ మహిళ.. పెట్రోల్​ పోసి కారుకు నిప్పు పెట్టింది. పక్కన ఆడుకుంటున్న పిల్లలు గమనించి.. కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది.  శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అనంతరం కారు యజమాని అజయ్​ కుమార్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. మహిళ కోసం సెర్చింగ్ మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే..  జాతేపూర్ నార్త్ లోహియా నగర్‌కు చెందిన అజయ్ కుమార్ శ్రీవాస్తవ శుక్రవారం తన భార్య హెల్త్ చెకప్ కోసం డాక్టర్ అంజు జైస్వాల్ క్లినిక్‌కి వెళ్లాడు. అజయ్ తన కారును మఝౌలీ కాంపౌండ్ ఆవరణలో పార్క్ చేశాడు. ఇంతలో బురఖా ధరించిన ఓ మహిళపెట్రోల్ నింపిన సీసా తీసుకువచ్చి కారుకు నిప్పంటించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలు ఆమెను మొదట పెద్దగా పట్టించుకోలేదు. సదరు మహిళ కారు టైరుకు నిప్పంటించేందుకు చాలాసార్లు ప్రయత్నం చేసింది. చివరకు కారు టైరుకు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగడంతో ఆమె పారిపోయింది. మరోవైపు మంటలను చూసిన చిన్నారులు అప్రమత్తం చేయడంతో స్థానికులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అనుమానాస్పద మహిళ గురించి పిల్లలు చెప్పారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అందులో బురఖా ధరించిన మహిళ కనిపించింది.

ఈ ఘటన తర్వాత అజయ్ కుమార్ శ్రీవాస్తవ డయల్ 112కు కాల్ చేసి సమాచారం అందించారు. కాంట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా క్యాంట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు SSP డాక్టర్ విపిన్ తడా తెలిపారు. త్వరలో ఆ మహిళను అరెస్ట్ చేస్తారని, ఆమె నుంచి వివరాలు సేకరిస్తామని చెప్పారు.

వీడియో Amar Ujala న్యూస్ నుంచి సేకరించబడింది…

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..