Katrina Kaif Opposite Vijay Sethupathi: కొన్ని కాంబినేషన్లు అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయేది అలాంటి ఓ రేర్ కాంబో. తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. ‘అంధాదున్'(Andhadhun) లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
దాదాపు ఈ ప్రాజెక్ట్ ఓకే కాగా.. పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’, ‘ముంబయికర్’.. తమిళంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇక కత్రినా కైఫ్(Katrina Kaif) ‘ఫోన్ బూత్’ అనే సినిమాలో నటిస్తోంది. అటు ఈమె హీరోయిన్‌గా నటించిన ‘సూర్యవంశీ’ త్వరలోనే విడుదల కానుంది.
Also Read: ఫ్యాన్స్‌కు సోనూసూద్ రిక్వెస్ట్.. ”నాపై ప్రేమను చూపేందుకు మీరు బాధను భరించకండి” అంటూ ట్వీట్..