AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Victrina: కత్రినా దంపతుల రిసెప్షన్‌ డేట్‌ ఫిక్స్‌!.. ముఖ్య అతిథులు వీరే!

రాజస్థాన్‌ వేదికగా ఇటీవలే వేడుకగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచి జీవితంలో కొత్త ప్రయాణాన్ని

Victrina: కత్రినా దంపతుల రిసెప్షన్‌ డేట్‌ ఫిక్స్‌!.. ముఖ్య అతిథులు వీరే!
Basha Shek
|

Updated on: Dec 16, 2021 | 9:11 PM

Share

రాజస్థాన్‌ వేదికగా ఇటీవలే వేడుకగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందించారు. కాగా విక్ట్రీనా పెళ్లి వేడుకలు, ప్రివెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించి క్యాట్‌ దంపతులు సోషల్‌ మీడియాలో వరుసగా ఫొటోలు షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో అవికాస్తా వైరల్‌గా మారుతున్నాయి. కాగా పెళ్లి వేడుకలను ముగించుకున్న విక్ర్టీనా దంపతులు ఇటీవల ముంబయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు తమ వివాహా వేడుకలకు హాజరుకాని మరికొందరి కోసం గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటుచేయాలనుకుంటున్నారు.

కాగా ఈ వేడుక కోసం క్యాట్‌ దంపతులు బాలీవుడ్‌ సెలబ్రిటీలందరినీ ఆహ్వానించారని తెలుస్తోంది. డిసెంబర్‌ 20న ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్‌ వేదికగా ఈ గ్రాండ్‌పార్టీని ఏర్పాటుచేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ముంబయిలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో పెళ్లి వేడుకల తరహాలోనే రిసెప్షన్‌ పార్టీ కోసం గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారట. ముందస్తు జాగ్రత్తగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అనుమతి తీసుకుని వారు సూచించిన ప్రొటోకాల్స్‌కు అనుగుణంగానే పార్టీ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ‘ సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారూఖ్‌ ఖాన్, రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్‌ తదితర ప్రముఖులకు ఆహ్వానం అందించాం. అయితే ప్రస్తుతం ముంబయిలో ఒమైక్రాన్ విస్తరిస్తో్ంది. అందుకే రిసెప్షన్‌కు వచ్చే వారందరూ ఆర్ టీ పీసీఆర్ టెస్ట్‌ను తప్పక చేయించుకోవాలి. నెగెటివ్ రిపోర్ట్‌ను తమ వెంట తీసుకురావాలి’ అని విక్ట్రీనా దంపతులతో సన్నిహితంగా మెలిగే ఒకరు చెప్పుకొచ్చారు. కాగా క్యాట్‌ దంపతుల చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. పెళ్లి వేడుకలతో అవన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో త్వరగా రిసెప్షన్‌ వేడుకలను నిర్వహించి మళ్లీ షూటింగ్‌లకు హాజరయ్యే పనిలో ఉన్నారట నవ దంపతులు.

Also Read:

Pushpa: బన్నీ సినిమా మార్నింగ్‌ షో టికెట్లు కావాలన్న దర్శకుడు.. హీరోయిన్‌ రిప్లై ఏంటంటే..

Sree Vishnu: అర్జునుడి ఆగమనానికి డేట్‌ ఫిక్స్‌.. శ్రీ విష్ణు కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..

Actress Nithya Menen : నవ్వే నయాగారం.. కవ్వించే వయ్యారం.. ‘నిత్య’ సోయగం.. (ఫొటోస్ )