కార్తికేయకు ‘బంపరాఫర్‌’.. కోలీవుడ్‌ టాప్‌ హీరో మూవీలో కీలక పాత్ర..!

'ఆర్‌ఎక్స్‌ 100'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. ఆ మూవీతో మంచి పేరును సంపాదించుకున్నారు.

కార్తికేయకు బంపరాఫర్‌.. కోలీవుడ్‌ టాప్‌ హీరో మూవీలో కీలక పాత్ర..!

Edited By:

Updated on: Sep 22, 2020 | 5:12 PM

Karthikeya Ajith movie: ‘ఆర్‌ఎక్స్‌ 100’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. ఆ మూవీతో మంచి పేరును సంపాదించుకున్నారు. అంతేకాదు నాని గ్యాంగ్‌ లీడర్‌ మూవీ కోసం విలన్‌గా మారి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ మధ్యలో హిప్పీ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే చిత్రంలో నటిస్తుండగా.. ఇప్పుడు ఈ హీరోకు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అదేంటంటే కోలీవుడ్‌ టాప్ హీరో మూవీలో కీలక పాత్రలో కార్తికేయ నటించనున్నారు.

అజిత్‌ హీరోగా వినోద్‌ తెరకెక్కిస్తోన్న వలిమైలో కార్తికేయ కనిపించనున్నారు. దీనిపై ఆ మధ్యన వార్తలు వచ్చినా.. ఎవరూ అధికారికంగా ప్రకటించకపోవడంతో రూమర్ అనుకున్నారు. కానీ నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఓ ట్వీట్ వేసిన కార్తికేయ, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అజిత్ ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పారు. చాలా కష్టపడి, అందరూ గర్వపడేలాగా చేస్తానని తెలిపారు. అంతేకాదు ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తమిళ్‌లో కామెంట్ పెట్టిన కార్తికేయ.. వలిమై, వైటింగ్ ఫర్ తలా దర్శినమ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఇచ్చారు. దీంతో అజిత్‌ మూవీలో కార్తికేయ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మిస్తున్నారు.

Read More:

ఆ యంగ్ హీరోకు నాగ్‌ మరో అవకాశం ఇస్తున్నారా.!

IPL 2020: రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్‌ ఓపెనింగ్ మ్యాచ్‌