Kangana Ranaut : మరో సారి హాట్ టాపిక్ గా బాలీవుడ్ బ్యూటీ .. నిజమైన కంగన ఎలా ఉంటుందో చూపిస్తానంటున్న క్వీన్..
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు వసాగా బాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారింది.
Kangana Ranaut comments : బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు వసాగా బాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ సింగ్ మరణం తరవాత కంగనా మరింత రెచ్చిపోయింది. తాజాగా వివాదంలో చిక్కుకున్న తాండవ్ వెబ్ సిరీస్ పైన కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ వెబ్ సిరీస్ వివాదం పై కంగనా స్పందిస్తూ.. “వారి తలలు తీసే సమయం వచ్చింది“ అంటూ ట్వీటర్ లో కామెంట్ చేసింది. తాండవ్ వెబ్ సిరీస్ లో హిందూ దేవుళ్ళను అవమానించారనే ఆరోపణల వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కంగనా ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ లో చర్చకు దారిసింది. అంతే కాదు ట్విట్టర్ సిఇఒ జాక్ డోర్సీని `చాచా …` అంటూ పిలిచింది కంగనా..నా వర్చువల్ ఐడెంటిటీ ఎప్పుడైనా దేశం కోసం అమరత్వం పొందొచ్చు. కానీ దేశభక్తి స్ఫూర్తి నా సినిమాల ద్వారా మళ్లీ కనిపిస్తుంది. నేను మీ జీవితాన్ని దయనీయంగా మార్చేస్తాను.. అంటూ రాసుకొచ్చింది కంగనా.. కాగా కొంతమంది నెటిజన్లు `సస్పెండ్ కంగనా రనౌత్` హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. దానికి కంగనా టీమ్ స్పందిస్తూ.. ” ఇప్పుడు వారు నన్ను సస్పెండ్ చేస్తే వర్చువల్ ప్రపంచం నుండి నిష్క్రమిస్తాను. వాస్తవ ప్రపంచంలో మీకు నిజమైన కంగనా ఎలా ఉంటుందో చూపిస్తాను.. అంటూ కంగనా టీమ్ పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చదవండి :