AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే ‘అమ్మ’ బయోపిక్‌ను ఒప్పుకున్నా

జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘తలైవి’లో లీడ్‌ రోల్‌లో నటించనుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి మాట్లాడింది కంగనా. ఈ సినిమా కోసం తాను తమిళ్‌ను నేర్చుకోనున్నట్లు కంగనా తెలిపింది. ‘‘ఈ సినిమాను తమిళంలో తీయబోతున్నాం. కాబట్టి సీన్లు సరిగ్గా అర్థం కావాలన్నా, […]

అందుకే ‘అమ్మ’ బయోపిక్‌ను ఒప్పుకున్నా
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 26, 2019 | 6:57 AM

Share

జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘తలైవి’లో లీడ్‌ రోల్‌లో నటించనుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి మాట్లాడింది కంగనా.

ఈ సినిమా కోసం తాను తమిళ్‌ను నేర్చుకోనున్నట్లు కంగనా తెలిపింది. ‘‘ఈ సినిమాను తమిళంలో తీయబోతున్నాం. కాబట్టి సీన్లు సరిగ్గా అర్థం కావాలన్నా, జయలలిత పాత్రను పూర్తిగా తెలుసుకోవాలన్నా తమిళం నేర్చుకోవాలి. త్వరలోనే తమిళం క్లాసులు తీసుకుంటా. నా జీవిత ప్రయాణానికి జయలలిత ప్రయాణానికి దగ్గరి పోలికలు ఉన్నాయి. కానీ ఆమె సక్సెస్‌ స్టోరీ నా కన్నా చాలా పెద్దది. అలాంటి ఈ కథ నా వద్దకు వచ్చింది కాబట్టి ఇందులో నటించేందుకు ఒప్పుకున్నా. లేకపోతే నా బయోపిక్‌లో నటించే దాన్ని. ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక్కడి వారు ముందు తమ సొంత చిత్ర పరిశ్రమకు ప్రాముఖ్యం ఇస్తారు’’ అంటూ కంగనా తెలిపింది.

Follow Us