పాన్ ఇండియా సినిమాలు చేసినా కలిసిరాని అదృష్టం..

14 June 2026

Pic credit - Instagram

Rajeev 

ఆగస్టు 17న హైదరాబాద్‌లోని హిందీ మాట్లాడే మార్వాడి కుటుంబంలో జన్మించింది అందాల భామ నిధి అగర్వాల్. అయితే ఏఈ అమ్మడు పెరిగింది మాత్రం బెంగళూరులో. 

2017లో టైగర్ ష్రాఫ్‌ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ నిధి అగర్వాల్ తొలిచిత్రం. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమాలో తన నటనతో అలరించింది నిధి అగర్వాల్. 

ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఈ చిన్నదానికి వరుస అవకాశాలు వచ్చిన హిట్స్ మాత్రం అంతగా రాలేదు. 

మొన్నటివరకు కుర్ర హీరోలతో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఇద్దరు పెద్ద హీరోలతో కలిసి సినిమాలు చేసింది. 

 పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్‌ నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.  

ఆతర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.