చాలాకాలం తర్వాత మళ్లీ కమల్ హాసన్ తన లుక్ తో అదరగొడుతున్నారు. కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు టూ ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన షూటింగ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కమల్ లుక్ చూస్తుంటే త్వరలోనే మళ్లీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 19 వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి న్యూస్ రాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌లో పాటు, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. కమల్ ప్రస్తుతం తమిళ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.