ఆడియన్స్‌కి కనెక్ట్ కాని కమల్..?

కమల్‌హాసన్ ఇటీవల పొలిటికల్‌గా తన లక్‌ని పరీక్షించుకున్నాడు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్‌హాసన్ నెలకొల్పిన పార్టీ బరిలోకి దిగింది. తమిళనాడులో కమల్ పార్టీ అభ్యర్థులు అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారు. కమల్ మాత్రం బరిలోకి దిగలేదు. ఐతే ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. దాంతో కమల్ హాసన్‌కి ఈ పొలిటికల్ స్టంట్‌ బాగా మైనస్‌ అయ్యింది. ఒకప్పుడు కమల్ హాసన్ సినిమా తమిళనాటే కాదు.. అన్ని భాషల్లోనూ డబ్ అయి.. గొప్ప విజయాలు సాధించేవి. […]

ఆడియన్స్‌కి కనెక్ట్ కాని కమల్..?
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 8:45 AM

కమల్‌హాసన్ ఇటీవల పొలిటికల్‌గా తన లక్‌ని పరీక్షించుకున్నాడు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్‌హాసన్ నెలకొల్పిన పార్టీ బరిలోకి దిగింది. తమిళనాడులో కమల్ పార్టీ అభ్యర్థులు అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారు. కమల్ మాత్రం బరిలోకి దిగలేదు. ఐతే ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. దాంతో కమల్ హాసన్‌కి ఈ పొలిటికల్ స్టంట్‌ బాగా మైనస్‌ అయ్యింది.

ఒకప్పుడు కమల్ హాసన్ సినిమా తమిళనాటే కాదు.. అన్ని భాషల్లోనూ డబ్ అయి.. గొప్ప విజయాలు సాధించేవి. అయితే.. ప్రస్తుతం కమల్ సినిమాలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అందుకే ఆయన స్టార్‌డమ్ తగ్గింది. రజనీకాంత్‌‌లా నేటి జనరేషన్‌కి రీచ్ కావడంలో కమల్ ఫెయిల్ అయ్యాడు. అదే పొలిటికల్‌గా కూడా బ్యాడ్ చేసింది. ఐతే తన సినిమాలు ఆడకపోయినా.. పారితోషికం విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అడుగుతున్నాడు. అందుకే ఆయనతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు రావడంలేదు. తాజాగా.. భారతీయుడు సినిమా సీక్వెల్‌ని కూడా పూర్తిగా పక్కన పెట్టారట.