AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్3: నాగార్జునపై అప్పుడే మొదలైన విమర్శలు

తెలుగు బుల్లితెరపై సంచలనం రేపిన బిగ్‌‌బాస్ మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జునను ఖరారు చేసేశారు నిర్వాహకులు. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదలైంది. అయితే ఈ షో ఇంకా ప్రారంభం అవ్వకముందే నాగార్జునను ఓ ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. దీనికి కారణం గతంలో ఆయన చేసిన కామెంట్లే. అసలు విషయానికొస్తే.. గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగార్జున బిగ్‌బాస్ షో గురించి స్పందించాడు. బిగ్‌బాస్ కాన్సెప్ట్ తనకు నచ్చలేదని, […]

బిగ్‌బాస్3: నాగార్జునపై అప్పుడే మొదలైన విమర్శలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 02, 2019 | 9:53 AM

Share

తెలుగు బుల్లితెరపై సంచలనం రేపిన బిగ్‌‌బాస్ మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జునను ఖరారు చేసేశారు నిర్వాహకులు. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదలైంది. అయితే ఈ షో ఇంకా ప్రారంభం అవ్వకముందే నాగార్జునను ఓ ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. దీనికి కారణం గతంలో ఆయన చేసిన కామెంట్లే.

అసలు విషయానికొస్తే.. గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగార్జున బిగ్‌బాస్ షో గురించి స్పందించాడు. బిగ్‌బాస్ కాన్సెప్ట్ తనకు నచ్చలేదని, ఒకరు ఏం చూస్తున్నారో అని తొంగిచూడటం తనకు ఎప్పుడూ నచ్చదని పేర్కొన్నాడు. ఇక తాజాగా బిగ్‌బాస్ హోస్ట్‌గా చేయడంపై స్పందించిన నాగ్.. ‘‘ప్రయోగాలు చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. బుల్లితెర నాకు కొత్త కానప్పటికీ.. బిగ్‌బాస్ చేయడం నాకు సరికొత్త అనుభూతి. ఇందులో భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా ఎగ్జైటింగ్‌గా’’ ఉందని పేర్కొన్నారు. దీంతో పాత వీడియోను, కొత్త వీడియోను షేర్ చేస్తోన్న నెటిజన్లు..‘‘బిగ్‌బాస్ షోను చేసేందుకు ఇప్పుడు నాగార్జున గారు ఎందుకు ఒప్పుకున్నారో’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

కాగా బిగ్‌బాస్ 3 ఈ నెల 21నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 14మంది కంటెస్టెంట్‌లతో వంద రోజుల పాటు ఈ షోను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ షోను అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?