
అందాల భామ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మాల్దీవులకు భర్తతో కలిసి హనీముూన్‌కు కూడా వెళ్లి వచ్చింది. దీంతో పెళ్లి సంబరాలకు పుల్‌స్టాప్ పెట్టి ఇక సినిమాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకుంది ఈ అమ్మడు. టాలీవుడ్‌లో యువ నటులతో పాటు అగ్ర హీరోలందరి సరసన నటించిన కాజల్ నటనతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తమిళంలో ఓ హారర్ చిత్రానికి సైన్ చేసింది. డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘ఘోస్టీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో ఎవరూ ఉండరని ఇటీవల దర్శకుడు ప్రకటించారు. అయితే హీరోయిన్‌లు మాత్రం నలుగురు నటిస్తున్నారు అందులో ఒకరు కాజల్ అగర్వాల్. పాత్రకు సంబంధించిన ఫొటోషూట్‌ను కూడా పూర్తిచేశామని చిత్రయూనిట్ తెలిపింది. కెరీర్‌లో ఇప్పటివరకు హారర్ కథాంశంలో నటించలేదు కాజల్ అగర్వాల్. కాగా ఈ జోనర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉందని, తన పాత్ర చిత్రణలో వైవిధ్యం కనిపిస్తోందని చెప్పింది. ఈ సినిమాలో కాజల్ దెయ్యాల వల్ల ఇబ్బంది పడే పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనుందని సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది.