AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: 2022లో ‘చిన్నారి చందమామ’ రానుందా..? కాజల్‌ భర్త చేసిన పోస్ట్‌కు అర్థం ఇదేనా.?

Kajal Aggarwal: కాజల్‌ అగర్వాల్‌ తల్లి కాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అటు కాజల్‌ కానీ, ఇటు భర్త గౌతమ్‌ కిచ్లూ కానీ ఈ విషయంపై అధికారికంగా మాత్రం స్పందించలేదు...

Kajal Aggarwal: 2022లో 'చిన్నారి చందమామ' రానుందా..? కాజల్‌ భర్త చేసిన పోస్ట్‌కు అర్థం ఇదేనా.?
Narender Vaitla
|

Updated on: Jan 02, 2022 | 11:37 AM

Share

Kajal Aggarwal: కాజల్‌ అగర్వాల్‌ తల్లి కాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అటు కాజల్‌ కానీ, ఇటు భర్త గౌతమ్‌ కిచ్లూ కానీ ఈ విషయంపై అధికారికంగా మాత్రం స్పందించలేదు. దీంతో ఈ వార్త కేవలం పుకారనే అందరూ భావించారు. కానీ తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా కాజల్‌ భర్త గౌతమ్‌ చేసిన ఓ పోస్ట్‌ ఈ జంట పేరెంట్స్‌గా ప్రమోషన్‌ కొట్టనున్నారని చెప్పకనే చెప్పేసింది. కొత్తేడాది వేడుకల్లో భాగంగా గోవాకు హాలీడే కోసం వెళ్లారు కాజల్‌, గౌతమ్‌. ఈ సందర్భంగా దిగిన కాజల్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన గౌతమ్‌ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు.

కాజల్‌ ఫోటోతో పాటు.. ‘2022.. నిన్ను చూస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో పాటు పక్కన ప్రెగ్నెంట్‌ లేడీ ఎమోజీని సైతం జోడించాడు. దీంతో ఇది గమనించిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక కాజల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2007లో తెలుగు సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘చందమామ’తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అనంతరం వరుస విజయాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ను 2020 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం కాజల్‌ నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, భారతీయుడు2 నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Gautam Kitchlu (@kitchlug)

Also Read: Viral Video: కాళ్లు లేని కుక్క‌ను.. మ‌ళ్లీ న‌డిచేలా చేసిన యువ‌కుడు..! వైరల్ అవుతున్న వీడియో..

Lion Attack: ఒక్కసారిగా వ్యక్తిపైకి దూకిన సింహం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Bhola Shankar : అదరగొట్టిన చిరు.. ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశానికి చేర్చిన స్వాగ్ ఆఫ్ భోళా..