Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ ఉన్నదేగా ఇక్కడా.. సెన్సార్‌ కత్తెరపై కాజల్ అసహనం

టాలీవుడ్ చందమామకు కోలీవుడ్ సెన్సార్‌ బోర్డుపై కోపం వచ్చింది. ఎంతో కష్టపడి తీస్తే ఇన్ని కట్‌లు ఏంటంటూ ఆమె ఫైర్ అవుతోంది. ఇలా కత్తిరించడం నాకేం నచ్చడం లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక అసలు విషయానికొస్తే కాజల్ ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకుడు రమేష్ అరవింద్ పారిస్ పారిస్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విజయం సాధించిన క్వీన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్న ఈ […]

అక్కడ ఉన్నదేగా ఇక్కడా.. సెన్సార్‌ కత్తెరపై కాజల్ అసహనం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2019 | 5:29 PM

టాలీవుడ్ చందమామకు కోలీవుడ్ సెన్సార్‌ బోర్డుపై కోపం వచ్చింది. ఎంతో కష్టపడి తీస్తే ఇన్ని కట్‌లు ఏంటంటూ ఆమె ఫైర్ అవుతోంది. ఇలా కత్తిరించడం నాకేం నచ్చడం లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక అసలు విషయానికొస్తే కాజల్ ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకుడు రమేష్ అరవింద్ పారిస్ పారిస్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో విజయం సాధించిన క్వీన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర దర్శక నిర్మాతలు పారిస్ పారిస్‌ను సెన్సార్‌ ముందుకు తీసుకెళ్లారు. అయితే అక్కడే టీమ్‌కు పెద్ద షాక్ తగిలింది. ఈ మూవీలో అసభ్యకర సీన్లు ఉన్నాయని చెప్పిన సెన్సార్ బోర్డు.. దాదాపు 25 సీన్లకు కత్తెర వేసింది. దీనిపై తాజాగా చందమామ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

‘‘దక్షిణాది అన్ని భాషల్లో మేము క్వీన్‌ను రీమేక్‌ చేశాం. అసలు సెన్సార్ వాళ్లు అన్ని కట్‌లు ఎందుకు చేశారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. మేము మరొకరి మనోభావాలను కించపరిచేలా సినిమా తీయలేదు. సెన్సార్ వాళ్లు ఏ సన్నివేశాలను కట్ చేయమని చెప్పారో అవన్నీ అందరి నిజ జీవితంలో జరిగేవే. ఆ సన్నివేశాలను సినిమాలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నేను నిర్మాతలకు చెప్పాను. ఈ సినిమా షూటింగ్ కోసం టీం మొత్తం ఎంతో కష్టపడింది. ఈ విషయంలో సెన్సార్ సభ్యులు మరోసారి ఆలోచిస్తారని భావిస్తున్నా’’ అని కాజల్ తెలిపింది.

కాగా దక్షిణాది అన్ని భాషల్లో క్వీన్ రీమేక్‌ అయింది. అందులో తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ నటించారు. అయితే అన్ని భాషల్లోనూ షూటింగ్ పూర్తైనప్పటికీ.. ఎందులోనూ ఈ రీమేక్ ఇంకా విడుదలకు నోచుకోలేదు.

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు