సినిమాలకు కాజల్‌ గుడ్‌బై.. చందమామ ట్వీట్‌ అంతర్యమేంటి..!

| Edited By:

Nov 03, 2020 | 4:51 PM

ఇటీవలే తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును పెళ్లాడి శ్రీమతిగా మారిన కాజల్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమాలకు కాజల్‌ గుడ్‌బై.. చందమామ ట్వీట్‌ అంతర్యమేంటి..!
Follow us on

Kajal Aggarwal tweet: ఇటీవలే తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును పెళ్లాడి శ్రీమతిగా మారిన కాజల్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడేం సమయం మించిపోలేదు. నేను నో చెప్పా అంటూ ఓ పెద్ద పోస్ట్‌ని ఆమె పెట్టారు.

”ఇది చాలా లేటు అయ్యిందని తెలుసు. ఇది నేను ముందే చేయాల్సింది. ప్రపంచానికి తెలిసేలా ఇప్పుడు లెటర్‌లో ఇలా చేస్తున్నందుకు క్షమించండి. కానీ నా ఫీలింగ్స్‌ని చెప్పేందుకు ఇదే సులభమైన విధానం. తరువాత బాధపడటం కంటే ఇప్పుడే నో చెప్పడం మంచిది.

ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఇంతలా మార్చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తెలియని శత్రువుతో ప్రపంచం మొత్తం భయపడుతున్న తీరు.. జీవితం గురించి నన్ను మార్చుకోనేలా చేసింది. వైరస్ నియంత్రణలో, హైజినిటో మనం ఇంకాస్త అలర్ట్‌గా ఉండాలి. భవిష్యత్‌ లైఫ్ స్టైల్‌పై నా ఆలోచన ధోరణి మారిపోతోంది. ఇప్పుడున్న నా లైఫ్‌స్టైల్‌ని పూర్తిగా మార్చుకోవాలనుకుంటున్నా. సురక్షితంగా ఉండటం కోసం, ఎంతటి కఠిన నిర్ణయానికైనా సిద్ధం” అని కాజల్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే కాజల్ చేసిన ఈ ట్వీట్‌తో అభిమానుల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. సురక్షితమైన జీవనం కోసం కాజల్ సినిమాలు మానేస్తారా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయటకు అడుగుపెట్టడం సురక్షితం కాదనడంలో అర్థమేంటని..? వారు ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రస్తుతం కాజల్‌ చేతిలో అరడజన్‌ చిత్రాలు ఉన్నాయి. మరి ఆ సినిమాల తరువాత ఆమె నటించరా..? పెళ్లి తరువాత కూడా నటిస్తానని చెప్పిన కాజల్‌ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నారా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.