Official: ప్రభాస్ ‘రాధేశ్యామ్’కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న రాధే శ్యామ్‌కి సంగీత దర్శకుడు ఖరారు అయ్యారు. యువ సంగీత తరంగం జస్టిన్ ప్రభాకరన్ రెబల్‌స్టార్ మూవీకి సంగీతం అందించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
Prabhas Radhe Shyam: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న రాధే శ్యామ్‌కి సంగీత దర్శకుడు ఖరారు అయ్యారు. యువ సంగీత తరంగం జస్టిన్ ప్రభాకరన్ రెబల్‌స్టార్ మూవీకి సంగీతం అందించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో మోషన్ పోస్టర్ విడుదల కానుండగా.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ పేరును వెల్లడించారు. అయితే ఈ మూవీకి మొదట సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేది ఖరారు కాగా.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కాగా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ద్వారా జస్టిన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఫలితం ఎలా ఉన్నా.. పాటలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ సినిమా ఆఫర్‌ని సొంతం చేసుకున్నారు జస్టిన్
అయితే పీరియాడిక్ రొమాంటిక్ ప్రేమ కథగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా వచ్చే ఏడాది రాధే శ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతోంది.
Read More:
Bigg Boss 4: వివాదాస్పద సింగర్ వైల్డ్‌కార్డు ఎంట్రీ..!
ఇప్పటికైనా ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటా: సింధు హెచ్చరిక