సెట్‌లో అడుగు పెట్టనున్న పవర్ స్టార్ !
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన చాలా సినిమాల షూటింగులు ప్రారంభమ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణలు జరుపుతున్నారు.
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన చాలా సినిమాల షూటింగులు ప్రారంభమ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణలు జరుపుతున్నారు. కాగా మెగాస్టార్, పవర్ స్టార్ ఇంకా షూటింగ్ షురూ చెయ్యలేదు. అయితే పవన్ లేని సీన్లను తెరకెక్కిస్తున్నారు వకీల్ సాబ్ మేకర్స్. త్వరలోనే పవర్ స్టార్ కూడా షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ ఆయన వకీల్ సాబ్ కోసం డేట్స్ కేటాయించారట. పవన్‌కు సంబంధించి ఇంకా 15 రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ లాయర్ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగెళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిందీ సినిమా ‘పింక్’ రీమేక్‌గా వకీల్ సాబ్ వస్తుంది. తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు.
ఇక వకీల్ సాబ్ అనంతరం క్రిష్ సినిమా కోసం కూడా పవన్ డేట్లు కేటయించినట్లు తెలుస్తోంది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ డిసెంబర్ నుంచి పాల్గొంటారని సమాచారం. వకీల్ సాబ్, క్రిష్ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ సినిమాలకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా కూడా రెండేళ్లలోపే పూర్తి చేయాలని చూస్తున్నాడు పవర్ స్టార్. ఎందుకంటే 2024 ఎన్నికలకు మళ్లీ రెడీ కానున్నాడు జనసేనాని.
Also Read : Bigg Boss Telugu 4 : అరియానాకు పెరుగుతోన్న ఫాలోయింగ్ !