AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భార్యకు అబార్షన్ అయినప్పుడు ఆ హీరో ఫోన్ చేసి చెప్పిన మాటకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి..

ప్రభాస్ శ్రీను జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం, అద్భుతమైన కుకింగ్ స్కిల్స్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ ఎమోషనల్ వ్యక్తి అని, కష్టకాలంలో మద్దతుగా నిలిచారని, అలాగే పిజ్జా, టమాటా పచ్చడి వంటివి సొంతంగా అద్భుతంగా వండుతారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన పూర్తి వివరాలు ఇలా ...

నా భార్యకు అబార్షన్ అయినప్పుడు ఆ హీరో ఫోన్ చేసి చెప్పిన మాటకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి..
Prabhas Sreenu
Ram Naramaneni
|

Updated on: Apr 16, 2026 | 4:43 PM

Share

జూనియర్ ఎన్టీఆర్ (తారక్) గురించి నటుడు ప్రభాస్ శ్రీను ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారని, తెర వెనుక ఆయన వ్యక్తిత్వం వేరని శ్రీను తెలిపారు. ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ వ్యక్తి అని వెల్లడించారు. యమదొంగ షూటింగ్ జరుగుతున్న సమయంలో తన భార్యకు అబార్షన్ జరిగినప్పుడు.. ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పి, మద్దతుగా నిలిచారని శ్రీను గుర్తు చేసుకున్నారు. “టెన్షన్ పడకు, నెక్స్ట్ పుట్టేవాడు నాలాంటివాడు పుడతాడు” అని ఓ హీరో అన్న ఆ మాటలు తనకెంతో గుర్తుండిపోయాయని వివరించారు. సెట్‌లో బయట నుంచి చూసే వారికి ఆయన గురించి వేరే అభిప్రాయం ఉండవచ్చు కానీ, ఆయనతో కలిసి పనిచేసిన వారికి ఆయన ప్రేమ, సరదా స్వభావం తెలుసన్నారు.

జై లవకుశ సినిమాలోని లవ పాత్ర షూటింగ్ సమయంలో ఆయన చాలా సైలెంట్‌గా, సాఫ్ట్‌గా ఉండేవారని.. జై పాత్ర కోసం మాత్రం పూర్తిగా వేరుగా, కొట్టేటట్టు, తిట్టేటట్టు కనిపించారని శ్రీను వివరించారు. లవ పాత్రలో ఉండగా, అంత దారుణంగా ఎందుకు ఉన్నారని అడిగితే, అది లవ పాత్ర అని, కుశ అలా ఉండడని చెప్పిన విషయాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ ఒక అద్భుతమైన కుక్ అని శ్రీను వెల్లడించారు. పిజ్జా అనేది రెస్టారెంట్లలో దొరుకుతుందని అనుకునేవారమని, కానీ ఆయన ఇంట్లో స్వయంగా పిజ్జా తయారు చేయగలరని, అది మామూలుగా ఉండదని అన్నారు. బిల్లా షూటింగ్ కోసం మలేషియా వెళ్లినప్పుడు, ఎన్టీఆర్ అక్కడికి వెళ్లారట. అక్కడి సర్వీస్ అపార్ట్‌మెంట్లలో ఉండే మినిమమ్ కిచెన్ వస్తువులతోనే, నెయ్యి వేసి వేడి అన్నంతో తినడానికి టమాటా పచ్చి పచ్చడి చేశారని, అది యూనిట్ అంతటినీ ఆశ్చర్యపరిచిందని వివరించారు. ఎన్టీఆర్ తల్లి కూడా రకరకాల వంటలు చేస్తారని, పైనాపిల్ కర్రీ, మిల్క్ విత్ పైనాపిల్ కర్రీ వంటి వెరైటీలు, నాన్‌వెజ్‌లో కూడా పీతల వంటివి పెద్ద సైజులో వండేవారని చెప్పారు.

ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్ డైట్ పాటిస్తారని, ఆయన తినే డైట్ చూస్తే మనకు తినాలనిపించదని అన్నారు.  ఎన్టీఆర్ అంత కఠినమైన డైట్ పాటించడం గ్రేట్ అని శ్రీను ప్రశంసించారు. చివరిగా, తానొక హీరో కావాలనే ఆలోచన లేదని, తనలాంటి ముఖాలు కామెడీ పాత్రలకే సరిపోతాయని, తెలుగు స్క్రీన్ ఎప్పుడూ అందగాళ్లకే ప్రాధాన్యత ఇస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us