నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేసిన ఓ కాంట్రాక్ట్ అటెండర్ రూ.2.65 కోట్లకు పైగా నిధులు స్వాహా చేశాడు. కేవైసీ అప్డేట్ల పేరుతో కస్టమర్ల వివరాలను సేకరించి, నిద్రాణమైన ఖాతాల నుండి తన మిత్రుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేసి, చివరికి తన ఖాతాకు తరలించుకున్నాడు. ఈ భారీ మోసం బ్యాంకులో కలకలం సృష్టించింది.