సైనిక ఘర్షణ సమస్యలను పరిష్కరించలేదు.. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే!
ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్ట పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గళం విప్పారు. యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కావని, కేవలం శాంతియుత చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్‌తో భేటీ అనంతరం మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్ట పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గళం విప్పారు. యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కావని, కేవలం శాంతియుత చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్‌తో భేటీ అనంతరం మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ – పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రపంచం నేడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. సైనిక ఘర్షణలు ఏ సమస్యను పరిష్కరించలేవు. ఉక్రెయిన్ అయినా, పశ్చిమ ఆసియా అయినా.. మా మద్దతు ఎప్పుడూ సుస్థిరమైన, దీర్ఘకాలిక శాంతికే ఉంటుంది” అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో భారత్ – ఆస్ట్రియా ఒకే విధమైన అభిప్రాయంతో ఉండటం విశేషం.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్‌తో జరిపిన భేటీ, ప్రపంచ శాంతి మరియు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్‌కు ఇది తొలి భారత పర్యటన. ఐరోపా వెలుపల ఆయన ఎంచుకున్న మొదటి దేశం భారత్ కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ పర్యటన రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ‘స్వర్ణ అధ్యాయం’ అని అభివర్ణించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ సంస్థలలో మార్పులు రావాలని ఇరు దేశాలు ఏకీభవించాయి. “సంఘర్షణల ద్వారా పరిష్కారాలు లభించవని భారత్, ఆస్ట్రియా బలంగా నమ్ముతున్నాయి. మానవాళి క్షేమం కోసం శాంతి మార్గమే శరణ్యం.” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఈ పర్యటన కేవలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలనే కాకుండా, ప్రపంచ వేదికపై శాంతి స్థాపన కోసం భారత్ పోషిస్తున్న క్రియాశీలక పాత్రను మరోసారి చాటిచెప్పింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు మరియు నవకల్పనల రంగాల్లో ఆస్ట్రియా సహకారం భారత్ వృద్ధికి మరింత తోడ్పడనుంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Federal Chancellor of Austria Dr Christian Stocker witness the MoU exchange between Dr Robert Zischg, the Ambassador of the Republic of Austria to India, and Shambhu S. Kumaran, Ambassador of India to the Republic of Austria.… pic.twitter.com/MWaJYaQnY4
— ANI (@ANI) April 16, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
