తిరుమలలో గురువారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సర్వ దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుండగా, భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. బుధవారం 77,077 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లుగా నమోదైంది. టీటీడీ భక్తులకు వసతులు, దర్శన సమయాలపై పర్యవేక్షణ చేపడుతోంది.