ప్రభాస్ ఇంటి ముందు జపాన్ అమ్మాయిల సందడి

బాహుబలి సిరీస్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. కేవలం ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. జపాన్ కు చెందిన కొందమంది అమ్మాయిలు హైదరాబాద్‌లోని ప్రభాస్ ఇంటి వద్ద హడావుడి చేశారు. ప్రభాస్ ఇంటి మెయిన్ గేట్ ముందు నిలబడి ఫోటో‌కు ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ప్రభాస్ నటించిన సన్సేషనల్ బాహుబలి సిరీస్‌కి జపాన్‌లో విశేష స్పందన వచ్చింది. ఆ సినిమా […]

ప్రభాస్ ఇంటి ముందు జపాన్ అమ్మాయిల సందడి
Follow us
Anil kumar poka

|

Updated on: Jun 10, 2019 | 1:57 PM

బాహుబలి సిరీస్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. కేవలం ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. జపాన్ కు చెందిన కొందమంది అమ్మాయిలు హైదరాబాద్‌లోని ప్రభాస్ ఇంటి వద్ద హడావుడి చేశారు. ప్రభాస్ ఇంటి మెయిన్ గేట్ ముందు నిలబడి ఫోటో‌కు ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

ప్రభాస్ నటించిన సన్సేషనల్ బాహుబలి సిరీస్‌కి జపాన్‌లో విశేష స్పందన వచ్చింది. ఆ సినిమా విడుదల సమయంలో బాహుబలి టీమ్ స్వయంగా అక్కడకు వెళ్లి మరీ ప్రచార కార్యక్రమాలు చేసింది. ఈ సిరీస్‌తో ప్రభాస్‌కు అక్కడ విపరీతంగా ప్యాన్స్ పెరిగిపోయారు. అయితే, జపాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఫ్యాన్స్ ప్రభాస్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారని, అక్కడ తీసుకున్న ఫొటో ఇదని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంతో బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేసిన ఈ మూవీని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించారు.