జపాన్‌లో ఇండియన్ మూవీస్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్ ఇండియాకు చెందిన హీరోలపై జపన్ దేశస్థులకు ఎక్కడలేని అభిమానం. అప్పట్లో రజినీకాంత్ చిత్రాలు ఎక్కువగా జపాన్ విడుదలవుతుండేవి. అయితే తాజాగా ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి చేరారు. తాజాగా ట్రిపులార్ సినిమా జపాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌లో సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తారక్ జపాన్‌లో అభిమానులతో గడుపుతున్నారు. జపాన్‌కు చెందిన వారు తారక్‌పై చూపిస్తున్న అభిమానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. తారక్‌తో అక్కడి వారు సెల్ఫీలు దిగడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది అభిమానులైతే తారక్‌ను చూశామన్న సంతోషంతో ఏకంగా కంటతడి పెట్టుకున్నారు. ఇక ట్రిపులార్ సినిమా కంటే ముందే ఎన్టీఆర్‌కు వీరాభిమానులుగా మారినట్లు తెలుస్తోంది. సింహాద్రి, యమదొంగ సినిమా క్యాసెట్లపై అభిమానులు ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు.
Die hard #NTR garu fans in Japan shower immense love on their star during #RRRinJapan promotions@tarak9999#NTRtakesoverJapan pic.twitter.com/gKPW8EA97n
— Mandvi Gayatri Sharma (@MandviSharma) October 21, 2022
ఇదిలా ఉంటే ట్రిపులార్ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తారక్ జపాన్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఏమాత్రం తడబడకుండా ఎన్టీఆర్ జపాన్ భాషలో మాట్లాడిన విధానం అక్కడి వారికి సైతం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ స్పీచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
Diction Meets Dedication.@tarak9999 Speaking Japan.#JrNTRinJapan #ManOfMassesNTR pic.twitter.com/VYPOcPI1J4
— WORLD NTR FANS (@worldNTRfans) October 21, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..