AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anu emmanuel: రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన అను ఇమ్మాన్యుయేల్‌.. వేరే ప్రశ్నలేవీ లేవా అంటూ..

మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌. తొలి సినిమాలోనే తనదైన అందం, అభినయంతో మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. అనంతరం పలు వరుస ఆఫర్లు దక్కించుకున్నా విజయం ఈ అమ్మడిని..

Anu emmanuel: రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన అను ఇమ్మాన్యుయేల్‌.. వేరే ప్రశ్నలేవీ లేవా అంటూ..
anu emmanuel counter to reporter
Narender Vaitla
|

Updated on: Oct 22, 2022 | 6:30 AM

Share

మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌. తొలి సినిమాలోనే తనదైన అందం, అభినయంతో మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. అనంతరం పలు వరుస ఆఫర్లు దక్కించుకున్నా విజయం ఈ అమ్మడిని పలకరించలేకపోయింది. అల్లు అర్జున్‌ వంటి బడా హీరోతో నటించినా ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ శిరీష్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపైనే అను ఆశలన్నీ పెట్టుకుంది. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 4న విడుదల కానుంది.

ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ విలేకరులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన అను తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘అల్లు అర్జున్ తో వర్క్ చేశారు అలాగే అల్లు శిరీష్ తో కూడా కలిసి పనిచేశారు. ఇద్దరిలో క్యూటెస్ట్ ఎవరు..? నాటీ ఎవరు..?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘వేరే ప్రశ్నలేవీ లేవా అడగడానికి..? మంచి ప్రశ్నలు అడగండి’ అంటూ నవ్వుతూనే కౌంటర్‌ వేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై శిరీష్‌ స్పందించారు. ఆ వార్తలన్నీ వట్టి పుకార్లనేనని కొట్టిపారేశారు. దీంతో నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్తలన్నీ ఫేక్‌ అని స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..