AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Faima: అప్పగింతల వేళ.. తల్లిని హత్తుకుని బోరున ఏడ్చిన జబర్దస్త్ ఫైమా.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో

జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా రీసెంట్ గా పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. ఈ వేడక జరిగి సుమారు వారం రోజులయ్యింది. అయితే ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్న ఫైమా తన పెళ్లికి సంబంధించి ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది.

Jabardasth Faima: అప్పగింతల వేళ.. తల్లిని హత్తుకుని బోరున ఏడ్చిన జబర్దస్త్ ఫైమా.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో
Jabardasth Faima
Basha Shek
|

Updated on: Jul 01, 2026 | 7:17 PM

Share

జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటి ఫైమా ఇటీవలే తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ ప్రేమికులు ఆ తర్వాత సంప్రదాయ బద్ధంగా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జబర్దస్త్ ఫైమా పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. జబర్దస్త్ సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే ఫైమా పెళ్లి జరిగి అప్ఉడే వారం రోజులు పూర్తయ్యింది. ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్నఆమె పెళ్లి తర్వాతి కార్యక్రమాల విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. మెట్టినింటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంటోంది. ఇదే క్రమంలో ఫైమా తన పెళ్లిలోని అరుదైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకటే సందర్భం.. ఇద్దరు తల్లుల వేదన అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇందులో పెళ్లి చేసుకుని మెట్టినింటికి వెళ్తున్న కూతురుని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఫైమా తల్లి కన్నీటి పర్యంతమైంది. తన కుమార్తెని హత్తుకుని బోరున ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో వీరిద్దరిని చూసి ఫైమా అత్తమ్మ కూడా బాగా ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు. అమ్మ ప్రేమకు ఏది సాటి రాదంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లిలో ఫైమా ఎమోషనల్ .. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

అంతకు ముందు పెళ్లి వేడుకలో భాగంగా  ప్రవీణ్ ఫైమా మెడలో మూడు ముళ్లు వేస్తుండగా ఫైమా తన భావోద్వేగాలను   ఆపుకోలేకపోయింది. అందరి ముందు కన్నీటి పర్యంతమైంది. దీంతో ప్రవీణ్ ఏడుస్తున్న భార్య కన్నీళ్లు తుడుస్తూ ఆమెను ఓదార్చాడు. మొత్తానికి ఫైమా- ప్రవీణ్ నాయక్ ల పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇంకా నెట్టింట ట్రెండింగ్ లోనే ఉన్నాయి.

 అత్తారింట్లో జబర్దస్త్ ఫైమా..

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us