AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో ఫోన్‌లో నన్ను అలా అనేసరికి షాక్ అయ్యాను.. ఆసక్తికర విషయం చెప్పిన అదిరే అభి

జబర్దస్త్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 13 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోందీ కామెడీ షో. ముఖ్యంగా వీకెండ్ లో ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తూ అందరికీ చేరవైంది జబర్దస్త్. ఈ క్రమంలోనే ఎంతో మంది ట్యాలెంటెడ్ నటీనటులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిందీ బుల్లితెర కామెడీ షో.

ఆ స్టార్ హీరో ఫోన్‌లో నన్ను అలా అనేసరికి షాక్ అయ్యాను.. ఆసక్తికర విషయం చెప్పిన అదిరే అభి
Adhire Abhi
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2026 | 12:49 PM

Share

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అదిరే అభి. తన కామెడీతో ఎంతో మందిని నవ్వించిన అభి సినిమాల్లోనూ తనదైన ముద్రవేశాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో అభి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇటీవల దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు అభి. గతంలో ఓ సినిమా ప్రచారంలో భాగంగా హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి వారిని ఎందుకు ఉపయోగించుకోలేదనే ప్రశ్నకు సమాధానం తెలిపాడు. అభి మాట్లాడుతూ.. తన కథకు తగిన పాత్రలు లేకపోవడమే కారణమని అభి స్పష్టం చేశారు. హైపర్ ఆది తన మాటను ఎప్పుడూ కాదనడని, కానీ ఆ ఆత్మీయతను దుర్వినియోగం చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని అభి తెలిపాడు. చిన్న పాత్రల కోసం కూడా ఆదిని ఒప్పించగలనని, కానీ అది అతన్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని పేర్కొన్నాడు

అలాగే అభి మాట్లాడుతూ..  సినిమా నిర్మాణ ప్రయాణంలో మానవ సంబంధాలపై అనేక పాఠాలు నేర్చుకున్నానని అదిరే తెలిపాడు. కొందరు నటీనటులు బడ్జెట్ గురించి ఆలోచించకుండా ముందుకు వచ్చి సహాయం చేశారని, టేస్టీ తేజ, ఇమ్మాన్యుయేల్, అప్పారావు వంటి వారు తమ సినిమా కోసం సహకరించారని ఆయన ప్రశంసించారు. అయితే, గతంలో తనకు సాయం చేసి, కష్టకాలంలో తోడుంటారని భావించిన ఒక వ్యక్తి, చివరి నిమిషంలో పారితోషికం విషయంలో మాట మార్చడం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. కోవిడ్ సమయంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతగా సినిమా చేస్తానని చెప్పిన ఆ వ్యక్తి, తన మేనేజర్ ద్వారా అధిక బడ్జెట్ డిమాండ్ చేయడం తనను నిరాశపరిచిందని తెలిపారు. ఈ అనుభవాలు మనుషుల నిజస్వరూపాన్ని, ముసుగులో ఉన్న మనుషులను అర్థం చేసుకోవడానికి దోహదపడ్డాయని అభి పేర్కొన్నారు. జబర్దస్త్ నుంచి సినిమా నిర్మాణంలోకి రావడం ద్వారా 24 క్రాఫ్ట్స్‌తో పనిచేయడం వల్ల విభిన్న వ్యక్తుల తత్వాలను తెలుసుకోగలిగానని ఆయన అన్నారు.

ఇక సినీ ప్రముఖులతో తన ఇంటరాక్షన్‌లను ప్రస్తావిస్తూ, వెంకటేష్ గారు తన కామెడీ షోలను చూస్తానని చెప్పి అభినందించారని, అలాగే బాలకృష్ణ గారు కూడా తనను చూస్తారని చెప్పి, రోజా గారు ఓసారి బాలయ్యకు ఫోన్ చేసి ఇవ్వగా “హాయ్ అభీ బ్రో” అని ఆయన పలకరించినప్పుడు ఆశ్చర్యపోయానని తెలిపారు. తన పేరు బాలకృష్ణ గారికి తెలుసన్న విషయం తనకు ఆనందాన్ని, షాక్‌ను కలిగించిందని అభి పేర్కొన్నాడు. నాగార్జున గారితో మాత్రం తన ఇంటరాక్షన్లు తక్కువగా ఉన్నాయని వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us