
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంతేకాదు మహేష్ కెరీర్‌లో బిజినెస్‌మ్యాన్, పోకిరి సినిమాల తరువాత అంత త్వరగా షూటింగ్ పూర్తైన చిత్రం ఇదే కావడం విశేషం. ఇవే కాదు సరిలేరు నీకెవ్వరుకు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే..!
-సరిలేరు నీకెవ్వరు’ సినిమా జులై 5న షూటింగ్ మొదలైంది.
-ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్‌లో జరిగింది. సోల్జర్స్ ఎపిసోడ్ మొత్తం అక్కడ చిత్రీకరించారు.
– రెండో షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ట్రెయిన్ సెట్‌లో జరిగింది. ఈ సెట్‌లో ఆల్ ఆర్టిస్టుల కాంబినేషన్‌లో హిలేరియస్ కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు.
-మూడో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్‌లో జరిగింది. ‘ఒక్కడు’ మూవీతో కొండారెడ్డి బురుజు మహేష్‌కు సెంటిమెంట్‌గా మారగా.. ఈ మూవీలో కూడా అది ఉందని తెలిసిన అభిమానులు హిస్టరీ రిపీట్ అంటూ అభిప్రాయపడ్డారు.
-‘ నాలుగో షెడ్యూల్ విజయశాంతి హౌస్ సెట్‌లో జరిగింది. విజయశాంతి హౌస్ సెట్ కోసం రాజేంద్రనగర్‌లో 20 ఎకరాల పొలాన్ని నిర్మాతలు లీజ్‌కు తీసుకున్నారు. అక్కడ పంట కూడా వేశారు. ఆ పంట పొలాల్లోనే ఓ పాటలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
-‘ సినిమాలో విలన్ డెన్‌లో ఐదో షెడ్యూల్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో ప్రకాష్‌రాజ్, మహేష్, విజయశాంతి మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
-పొల్లాచ్చిలో జరిగిన షెడ్యూల్లో సూర్యుడివో, చంద్రుడివో పాటను, కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరించారు. కేరళ ఫారెస్ట్ లో షూట్ చేసిన ఫైట్ సినిమాకు హైలైట్ అవుతుంది. పొల్లాచ్చి సెటప్‌లోనూ, కేరళ బ్యాక్‌డ్రాప్‌లోనూ హి ఈజ్ సో క్యూట్ పాటను చిత్రీకరించారు. సూర్యుడివో, చంద్రుడివోలో కూడా కొన్ని షాట్స్ ఇక్కడ తెరకెక్కించినవి ఉన్నాయి.
– తమన్నా స్టెప్పులేసిన డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన పెద్ద సెట్‌లో రూపొందింది.
– మైండ్ బ్లాక్ పాటను అన్నపూర్ణలో వేసిన సెట్‌లో తెరకెక్కించారు.
-ఈ చిత్రంతో ముగ్గురు నటులు రీ ఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని వెండి తెరమీద అలరించిన సంగీత కూడా ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రైన్ ఎపిసోడ్‌లో బండ్ల గణేష్ చేసే అల్లరి హైలైట్ అవుతుందట. నిర్మాతగా మారి నటనకు దూరమైన బండ్ల గణేష్‌కు ఇది రీ ఎంట్రీ చిత్రమే.
-ఒక్కడు, దూకుడు, పోకిరి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బిజినెస్‌మేన్… చిత్రాల్లో మహేష్ – ప్రకాష్‌రాజ్ కాంబినేషన్ ఎంత వైవిధ్యంగా ఉంటుందో, ఈ చిత్రంలో అంతకు మించి ఉంటుందని టాక్.
-మహేష్ సరసన రష్మిక తొలిసారి జోడీ కట్టిన సినిమా ఇది.
– సరిలేరు నీకెవ్వరు అనేది మహేష్‌ని ఉద్దేశించి పెట్టిన టైటిల్ కాదు. ఇది మన సైన్యాన్ని ఉద్దేశించిన పెట్టిన టైటిల్.
-మహేష్ – దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల్లాగే, ఈ చిత్రంలోనూ పాటలు హిట్ అయ్యాయి. ఇప్పటికే పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మహేష్ మండేస్ పేరుతో పాటలను రిలీజ్ చేశారు.
-1-నేనొక్కడినే, బ్రహ్మోత్సవం చిత్రాల తర్వాత సరిలేరుకు రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.
-దిల్‌రాజుతో గత సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఈ ఏడాది సంక్రాంతికి మళ్లీ ఆయనతోనే కంటిన్యూ అవుతున్నారు.