Vijay devarakonda: తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన చోటు దక్కించుకున్నారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న విజయ్ సినిమా సినిమాకు తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ (Liger) సినిమాలో నటిస్తోన్న విజయ్.. ఈ చిత్రం పూర్తికాగానే ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం.
ఇక ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా సమంత (Samantha) నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఖరారు అయినట్లేనని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కథకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా కశ్మీర్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా తరహాలో ఈ సినిమా ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
ఎన్నో ఎమోషన్స్‌తో కూడిన ఈ ప్రేమ కథను ఈ తరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా శివ స్క్ర్పిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. సినిమా పూర్తిగా భావోద్వేగాలతో కూడుకొని ఉంటుందని, ఇందులో విజయ్ పాత్ర కూడా సరికొత్త పంథాలో సాగుతుందని సమాచారం. విజయ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మరి ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకనట వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Tax Planning: చివరి క్షణాలో తొందర వద్దు.. ముందుగానే ఇలా టాక్స్ ప్లానింగ్ చేసుకోండి..
Viral News: గూగుల్ మ్యాప్స్‌లో వింత పర్వతం.. ఏంటా చూస్తే పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
Viral Video: నూడుల్స్ సూప్‌లో ఐస్‌క్రీమ్.. లొట్టలేసుకుని తింటోన్న కస్టమర్లు.. ఎక్కడంటే..