Pooja Hegde: అది ఎప్పటికీ మిస్ చేయను.. స్కిన్‌కేర్ సీక్రెట్ రివీల్ చేసేసిన ‘జిగేల్’ రాణి
కళ్లు జిగేల్ అనేంత మెరుపు.. చూపు తిప్పుకోలేని అందం.. యూత్‌ను కవ్వించే ఫిట్‌నెస్.. ఇవన్నీ ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే సొంతం. హీరోయిన్‌గా నటిస్తూనే ఐటమ్ సాంగ్స్‌తోనూ అభిమానుల్ని అలరిస్తుంది పూజా. రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసి ప్రేక్షకులకు..

కళ్లు జిగేల్ అనేంత మెరుపు.. చూపు తిప్పుకోలేని అందం.. యూత్‌ను కవ్వించే ఫిట్‌నెస్.. ఇవన్నీ ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే సొంతం. హీరోయిన్‌గా నటిస్తూనే ఐటమ్ సాంగ్స్‌తోనూ అభిమానుల్ని అలరిస్తుంది పూజా. రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
35 ఏళ్ల వయసు వచ్చినా 25 ఏళ్ల యంగ్ లుక్‌తో యూత్‌ను ఫిదా చేసేస్తోంది ఈ ముంబై భామ. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా ఉంది. భారీ ప్రాజెక్టులు చేస్తూ పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకున్న పూజా.. గ్లోయింగ్ స్కిన్, టోన్డ్ బాడీ సీక్రెట్స్‌ను తాజాగా బయటపెట్టింది. సింపుల్‌గా చిన్న చిన్న ట్రిక్స్ మాత్రమే పాటిస్తానని అయితే వాటిని మాత్రం ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తానని చెబుతోంది పూజా.
రొటీన్ స్కిన్ కేర్..
ప్రతిరోజూ ఉదయం, రాత్రి ముఖాన్ని క్లెన్స్ చేసుకుంటుంది. దీనికి ఏ ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వదు. అంతేకాదు, క్రమం తప్పకుండా CTM ( Cleansing-Toning-Moisturising) చేస్తుంది.
సన్‌స్క్రీన్..
ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సన్‌స్క్రీన్ లోషన్ తప్పక రాసుకుంటుంది.

Pooja Hegde2
నేచురల్ ఫేస్ ప్యాక్..
వారానికి రెండు నుంచి మూడుసార్లు ముల్తానీ మట్టి, పసుపు, తేనె, పెరుగు కలిపిన ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది.
మేకప్ తీసేసి..
సింప్లిసిటీకి ప్రాధాన్యమిచ్చే పూజా హెగ్డే పాటించే గోల్డెన్ రూల్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో పడుకునే ముందు మేకప్ తీసేయాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మేకప్ రిమూవ్ చేసుకున్న తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంది. ప్రి మెచ్యూర్ ఏజింగ్‌ను నివారించడానికి ఇది చాలా ఉపయోగమని చెబుతుంది బుట్టబొమ్మ.
ఫేవరెట్ కొబ్బరినూనె..
సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ మాయిశ్చరైజర్ కొబ్బరినూనె పూజ ఫేవరెట్. రోజూ ఒక చెంచా కొబ్బరినూనె తాగుతుంది. స్కాల్ప్ మసాజ్ చేసుకుంటుంది. అది మ్యాజికల్ నరిషింగ్‌లా పనిచేస్తుందని చెబుతుంది. హల్దీ, తాజా పాలతో చేసిన మాస్క్ ఫేస్ గ్లో కోసం వీలైనప్పుడల్లా వేసుకుంటుంది. తనది డ్రై స్కిన్ కాబట్టి మాయిశ్చరైజర్ తప్పక అప్లై చేసుకుంటుంది. మేకప్ తక్కువగా చేసుకునేందుకే ఆసక్తి చూపుతుంది. స్కిన్‌ను బ్రీత్ తీసుకునేలా చేయడమే తన మంత్రం అని చెబుతుంది పూజా హెగ్డే.




