Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ నటి బయోపిక్‌లో తప్పకుండా నటిస్తా: టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న
Rashmika Mandanna: రష్మిక మందన్న.. ఈ భామకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్‌లో ఎంట్రరీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వచ్చింది. అతి కొద్ది ....

Rashmika Mandanna: రష్మిక మందన్న.. ఈ భామకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్‌లో ఎంట్రరీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వచ్చింది. అతి కొద్ది రోజుల్లోనే దూసుకువెల్లిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మహేష్ సరసన నటించి ప్రస్తుతం అల్లు అర్జున్తోనూ నటిస్తోంది. అందం అభినయంతో పాటు సక్సెస్ శాతం రేట్ కూడా ఎక్కువే ఉండటంతో రష్మిక డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారట.
2008 విడుదలైన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్‌వాత వరుస విజయాలను అందుకుంది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్స్‌లో నటించింది. సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్పం’లో కూడా రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా హిందీలోనూ విడుదల అవుతుండటంతో రష్మిక బాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది.
కాగా, ఇటీవల రష్మిక ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. మీకు బయోపిక్‌లో నటించడానికి అవకాశం వస్తే ఎవరి స్టోరిని ఎంచుకుంటారు అని అడగగా, తాను అలనాటి స్టార్ హీరోయిన్, దివంగత శ్రీదేవి, సౌందర్య జీవిత కథలను ఎంచుకుంటాననని చెప్పుకొచ్చింది. ఈ డ్రిమ్ రోల్స్‌లో అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోనని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఏ హీరోయిన్ అయినా ఒప్పుకోక మానదు. మరి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.
Taapsee Pannu’s New Post: సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకున్న తాప్సీ పిక్.. పోస్టు వైరల్
