14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యా: ఆమిర్ తనయ

14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్ తనయ ఐరా ఖాన్ తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు.

14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యా: ఆమిర్ తనయ

Edited By:

Updated on: Nov 02, 2020 | 3:50 PM

Aamir Khan Ira Khan: 14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్ తనయ ఐరా ఖాన్ తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు. అందులో భాగంగా.. ”14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యా. అసలు అప్పుడు వారు నన్ను ఎందుకు అలా చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. ప్రతి రోజు కాకపోయినా నాపై తరచుగా లైంగిక వేధింపులు జరిగేవి. వారు ఇదంతా తెలిసే చేస్తున్నారు అని తెలుసుకునేందుకు నాకు సంవత్సరం పట్టింది. వెంటనే నా తల్లిదండ్రులు ఈమెయిల్‌ చేసి, ఆ పరిస్థితి నుంచి బయటపడ్డా. ఆ పరిస్థితి నుంచి బయట పడ్డాక నేనేం తప్పుగా ఫీల్‌ అవ్వలేదు. నేనేం భయపడలేదు. ఇది నాకు జరగాల్సింది కాదు అని మాత్రమే అనుకున్నా. ఆ తరువాత నేను దాన్ని మర్చిపోయి, ముందుకు సాగా” అని ఐరా అన్నారు. ఇక తన తల్లిదండ్రులు విడిపోయిన ఎఫెక్ట్ తన మీద ఏం పడలేదని, అమ్మ నుంచి విడిపోయినప్పటికీ తన తండ్రి తనను చాలా బాగా చూసుకున్నారని ఆమె అన్నారు.

Read More:

ఏపీలో ఆన్‌లైన్‌లో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు.. హైకోర్టు స్టే

ఆర్జీవీ ‘దిశ’కు మరో ఎదురుదెబ్బ