గౌతమ్‌తో తప్ప మరెవరితో నా జీవితాన్ని ఊహించుకోలేను: కాజల్‌

| Edited By:

Nov 06, 2020 | 10:49 AM

టాలీవుడ్ చందమామ కాజల్‌ గత నెల 30న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

గౌతమ్‌తో తప్ప మరెవరితో నా జీవితాన్ని ఊహించుకోలేను: కాజల్‌
Follow us on

Kajal Aggarwal Gautam: టాలీవుడ్ చందమామ కాజల్‌ గత నెల 30న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా గౌతమ్‌, కాజల్‌ల మధ్య 10 ఏళ్ల సాన్నిహిత్యం ఉండగా.. ఆ విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు చందమామ. ( కరోనా అప్‌డేట్స్‌.. దేశంలో కొత్త కేసులు ఎన్నంటే)

ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో తన భర్త గౌతమ్‌ గురించి మరిన్ని విషయాలను చెప్పుకొచ్చింది కాజల్‌. ”ఒక నటిగా, ఒక వ్యక్తిగా నా జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుఫల్లాలను గౌతమ్ చూశాడు. గౌతమ్‌తో తప్ప మరెవరితో నా జీవితాన్ని ఊహించుకోలేను” అని కాజల్ వివరించింది. కాగా నవంబర్ 4న తన మొదటి కార్వా చౌత్‌ని జరుపుకున్నారు చందమామ. ఆ రోజున కాజల్‌ తన భర్త కోసం పూజ చేసి, ఉపవాసం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ( నితిన్ ‘భీష్మ’కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్స్‌)