Pushpa: తగ్గేదేలే.. ఇదెక్కడి మాస్ మావా.! పుష్పరాజ్ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

| Edited By: Ravi Kiran

Jan 18, 2022 | 8:48 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'పుష్ప'.  గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది

Pushpa: తగ్గేదేలే.. ఇదెక్కడి మాస్ మావా.! పుష్పరాజ్ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పుష్ప’.  గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులను అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.  క్రికెటర్లు, సినిమా తారలు వీటిని  రీక్రియేట్, స్పూఫ్స్, కవర్ సాంగ్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు కూడా పుష్పరాజ్‌ను వాడేశారు. వివిధ సినిమాల్లోని డైలాగులు, పాటలతో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న వారు తాజాగా పుష్పరాజ్ తో కూడా అదే వినూత్న ప్రయోగం చేశారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలని చెబుతూ పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న  బన్నీ ఫొటోకు  హెల్మెట్‌ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు.  ఆ ఫొటోపై   ‘హెల్మెట్‌ తప్పని  సరి.. తగ్గేదే లే..’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  ‘హెల్మెట్‌ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.’ అంటూ ట్వీట్‌ చేశారు  హైదరాబాద్ పోలీసులు. ట్రెండింగ్ లో ఉన్న సినిమా డైలాగులతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తే జనాల్లోకి బాగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే పోలీసులు ఇలా పుష్పరాజ్ ను వినూత్నంగా వాడేశారు.  కాగా   ప్రముఖ  డెయిరీ వ్యాపార సంస్థ ‘అమూల్‌’ తన వ్యాపారం కోసం ‘పుష్పక్ ది స్లైస్‌.. అమూల్ హ్యావ్  స‌మ్ అమ్ములు, అర్జున్‌..’ అనే కార్టూన్‌ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన నెట్టింట్లో వైరల్ గా మారింది. బన్నీ కూడా ఈ పోస్టుపై స్పందించాడు.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Road Accident: గుంటూరు జిల్లాలో విషాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి దుర్మరణం..

Budget2022: వ్యవసాయ రంగానికి గతేడాది బడ్జెట్ కేటాయింపు ఎంత? అప్పటి ప్రతిపాదనలు ఏమిటి? తెలుసుకుందాం..