Mahavatar Narsimha: హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

‘కేజీఎఫ్‌’, ‘కాంతార’, ‘సలార్’ తదితర చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ . ఇప్పుడీ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మరో సరికొత్త ప్రాజెక్టు రానుంది. మహవతార్ నరసింహ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mahavatar Narsimha: హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
Mahavatar Narsimha
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2025 | 3:49 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఇప్పటి వరకు ఎన్నో రకాల సినిమాలను అందించింది. అందులో ఎక్కువగా కమర్షియల్‌ యాక్షన్‌ చిత్రాలే ఉన్నాయి. అయితే ఇప్పుడీ సంస్థ మొదటిసారిగా ఓ యానిమేషన్ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి ‘మహావతార నరసింహ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, సంక్రాంతి సందర్భంగా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అలాగే సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించారు. ఇక తాజాగా రిలీజైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ‘నీ పుత్రుని వీరమరణం గురించి నువ్వు శోకించడం మాత.. విష్ణువు నీ సామర్థ్యాన్ని ఇలా సవాలు చేస్తున్నాడు.. నువ్వు నీ పుత్రుడిని వదించాలి అనుకుంటే.. వాడు తన భక్తుడుని కాపాడాలి అనుకుంటున్నాడు’ అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఇంతలో భక్తుడు (చిన్న పిల్లోడు) నరసింహ స్వామిని స్మరిస్తూ ఉండగా.. ఆ బాలుడుని కొందరు చంపేందుకు చూస్తారు. ఇక చివరిలో నరసింహ స్వామి మహావతార్‌లో వచ్చినట్టు చూపించారు. టీజర్ లోని విజువల్స్ చూస్తుంటే గత సినిమాల్లోగానే హోంబల్ ఫిల్మ్స్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా నరసింహుని కథ చాలా మందికి తెలిసిందే. విష్ణువు అవతారాలలో నరసింహుని అవతారం కూడా ఒకటి. హిరణ్య కశిపుని కొడుకు ప్రహ్లాదుడు ఎప్పుడూ హరి భజన చేస్తూ ఉంటాడు. దానికి హిరణ్య కశిపుడు చిరాకు పడుతుంటాడు. ‘నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా… ఈ స్తంభంలో ఉన్నాడా’ అని అడగడం, అప్పుడు స్తంభాన్ని బద్దలు కొడుతూ నరసింహుడు రావడం, హిరణ్య కశిపుడిని సంహరించడం.. ఇప్పుడు ఇదే విషయాన్ని టీజర్ లో చూపించారు.

ఇవి కూడా చదవండి

‘మహావతార నరసింహ’ చిత్రం హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. 3D వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రానికి సామ్‌ సిఎస్‌, శ్లోకా సంగీతం అందిస్తున్నారు. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విష్ణు మహాఅవతారాల పరంపరను తీసుకురావాలని యోచిస్తున్న హోంబలే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌లో మొదటి సిరీస్ గా ‘నరసింహ మహావతార్’ చిత్రాన్ని నిర్మిస్తోంది.

‘మహావతార్‌ నరసింహ’ టీజర్

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.