OSCAR AWARDS 2023: భారత కాలమానం ప్రకారం ఆస్కార్ ప్రకటన ఎప్పుడంటే..

|

Mar 10, 2023 | 8:38 PM

ఈ ఏడాది ఆస్కార్ ప్రకటన తేదీ, సమయం తెలుసుకోవాలాని మన తెలుగువారు చూస్తున్నారు. భారత్‌లో ఏ సమయాలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

OSCAR AWARDS 2023: భారత కాలమానం ప్రకారం ఆస్కార్ ప్రకటన ఎప్పుడంటే..
Oscar Awards 2023
Follow us on

యావత్‌ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్‌. ఆ పురస్కారం దక్కించుకోవాలని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. మరి, సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 95వ అకాడమీ వేడుకల సందడి మొదలైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో చిత్రాలు ఈ అవార్డ్స్ అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. అందులో మన తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు.. సెలబ్రెటీలు అమెరికాలో దిగిపోయారు. మార్చి 12న అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స్‏ని డాల్బీ థియేటర్‏లో ఈ వేడుకలు అంగరంగా వైభవంగా జరగనున్నాయి. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కోసం డాల్బీ థియేటర్ ముస్తాబయ్యింది. ఇంతకీ ఈ థియేటర్‏లో ఎన్ని గంటలకు జరుగుతాయి..? భారత కాలమానం ప్రకారం ఆస్కార్ ప్రకటన ఎప్పుడు ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి . అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు వేడుక ప్రారంభమవుతుంది. మన దేశంలో సోమవారం 13వ తేదీ ఉదయం 5.30 గంటలకు IST ప్రత్యేక్ష ప్రసారంలో మనం చూడవచ్చు.

ఈ సంవత్సరం ఎవరు హోస్ట్ చేస్తారు?:

ఆస్కార్స్‌లో  జిమ్మీ కిమ్మెల్ 2018 తర్వాత మొదటిసారి వేడుకను నిర్వహించనున్నారు. వాండా సైక్స్, రెజీనా హాల్, అమీ షుమెర్ గత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. టెలివిజన్ హోస్ట్, హాస్యనటుడు, రచయితగా అమెరికా నుంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన జిమ్మీ కిమ్మెల్, ABC టెలివిజన్‌లో ‘జిమ్మీ కిమ్మీ లైవ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా చాలా దృష్టిని ఆకర్షించాడు.

స్వీకరించారునామినేట్ చేయబడిన ఉత్తమ చిత్రాలు?:

ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అవతార్, ది వే ఆఫ్ వాటర్, ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిష్రెయిన్, ఎల్విస్, ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్, ది ఫేబుల్‌మ్యాన్స్, టార్, టాప్ గన్, మావెరిక్, ట్రయాంగిల్ ఆఫ్ జోరో, విమెన్ టాకింగ్ లిస్టెడ్ ఉత్తమ చిత్రాలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.