AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar The Way Of Water : జేమ్స్‌ కామెరాన్‌ మరో అద్భుత సృష్టి.. “అవతార్ 2” ట్రైలర్ అదుర్స్

2009లో విడుదలైన 'అవతార్' మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవతార్ సినిమా తర్వాత అలాంటి సోషియో ఫాంటసీ సినిమాలకు క్రేజ్ మరింత పెరిగింది.

Avatar The Way Of Water : జేమ్స్‌ కామెరాన్‌ మరో అద్భుత సృష్టి.. అవతార్ 2 ట్రైలర్ అదుర్స్
Avatar 2
Rajeev Rayala
|

Updated on: Nov 02, 2022 | 6:38 PM

Share

ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో ముందు వరసలో ఉన్న సినిమా అవతార్ . జేమ్స్‌ కామెరాన్‌ అద్భుత సృష్టి అవతార్ సినిమా.ఈ సినిమాతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు దర్శకుడు. 2009లో విడుదలైన ‘అవతార్‘ మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవతార్ సినిమా తర్వాత అలాంటి సోషియో ఫాంటసీ సినిమాలకు క్రేజ్ మరింత పెరిగింది. మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధంన్ని అద్భుతంగా చూపించారు దర్శకుడు జేమ్స్. 234 మిలియన్ డాలర్ల బడెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.924 బిలియన్ డాలర్లను వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ రానుంది.

ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన గ్లిమ్స్ ను , పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా నుంచి  ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో మూవీ పై అంచనాలను ఆకాశానికి చేర్చారు దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ . అవతార్ 2లోకథ అండర్ వాటర్ నేపథ్యంలో సాగనుంది. మరోసారి మనుషులకు గ్రహాంతరవాసులు మధ్య జరిగే వార్ ను చూపించనున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను 16 డిసెంబర్ 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అవతార్-2’ రన్ టైమ్ సైతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అవతార్ మొదటి పార్ట్ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలకు కాగా రెండో పార్ట్ రన్ టైమ్ మాత్రం మూడు గంటల పది నిమిషాలు ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..