Home Alone: హోమ్ అలోన్ నటుడుపై అత్యాచార ఆరోపణలు.. నపుంశకుడిని అంటూ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన యాక్టర్
లిసా స్మిత్ తరపు లాయర్ ఇదే విషయంపై మాట్లాడుతూ..తనపై అత్యాచారం జరగడానికి ముందు 15 ఏళ్లుగా ఇద్దరం స్నేహితులుగా ఉన్నామని చెప్పారు.
Home Alone: ‘హోమ్ అలోన్’ సినిమా నటుడు ‘డెవిన్ రేట్రే’ (Devin Ratray) చిక్కుల్లో పడ్డారు. నటుడు డెవిన్ రేట్రే ఓ మహిళ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆన్‌లైన్ మీడియా నివేదిక ప్రకారం.. 2017లో న్యూయార్క్ లోని మాన్హాటన్ అపార్ట్‌మెంట్‌లో నటుడు డెవిన్ రేట్రే తన పై దాడి చేసినట్లు లీసా స్మిత్ ఆరోపించింది. తాను తగిన డ్రింక్ లో మాదక ద్రవ్యాలు కలిపి.. ఆపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. అయితే లీసా చేస్తోన్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని ‘డెవిన్ రేట్రే’ ఖండించాడు.
తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలని డెవిన్ రేట్రే ఖండించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని సంఘటనపై గృహ హింస ఆరోపణలను ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. డెవిన్ రాట్రే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు చేసినట్లు లిసా ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే లిసా ఆరోపణలపై గురించి డెవిన్ రాట్రే తరపు ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. మరి ఈ విషయాన్నీ ఇన్ని ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదో లిసా చెప్పాలని డిమాండ్ చేశారు .
అదే సమయంలో.. లిసా స్మిత్ తరపు లాయర్ ఇదే విషయంపై మాట్లాడుతూ..తనపై అత్యాచారం జరగడానికి ముందు 15 ఏళ్లుగా ఇద్దరం స్నేహితులుగా ఉన్నామని చెప్పారు.
తన సోదరుడు, స్నేహితుడితో కలిసి మద్యం సేవించిన తర్వాత.. వారందరూ నటుడు డెవిన్ రాత్రే ఫ్లాట్‌కి వెళ్లామని లిసా చెప్పింది. అక్కడ తనకు డ్రింక్ ఇచ్చారని.. అది తాగిన తర్వాత తనను మత్తు ఆవరించిందని.. కదలలేని స్టేజ్ చేరుకున్నట్లు చెప్పింది. తాను నిజంగా కళ్ళు తెరవలేకపోయానని.. అయితే తనకు ఎదో జరుగుతుందని మాత్రం అనిపించింది. తనతో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లిపోయారని తనకు ఆ విషయం తెలిసిందని.. తాను మాత్రం సోఫాలోనే ఉన్నానని లిసా చెప్పింది. తనను సెట్‌లో వదిలేసే ముందు డెవిన్ రేట్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ పేర్కొంది. అయితే తాను నపుంసకుడు కనుక ఆ మహిళా చెప్పినట్లు తాను అత్యాచారం చేయలేనని.. అదంతా అవాస్తవాలని.. లిసా చేసిన ఆరోపణలను నటుడు కొట్టిపారేశాడు.
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..