స్పైడర్ మ్యాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి ఎక్కువగా ఇష్టపడే హాలీవుడ్ మూవీ. సాధారణంగా మన దగ్గర హాలీవుడ్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి. అందులో స్పైడర్ మ్యాన సినిమా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల డిసెంబర్ 16న విడుదలైన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసింది. జాన్ వాట్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో జెండయ, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బటలన్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి, జె. బీ స్మూవీ, బెనెడిక్ట్ వాంగ్, జామీ ఫాక్స్, ఆల్ఫ్రాడ్ మోలిన, విల్లెమ్ డఫో, థామస్ హడెన్ చర్చ్, రాయిస్ ఇఫాన్స్ ముఖ్య పాత్రలను పోషించారు.
ఇదిలా ఉంటే.. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిలియన్ డాలర్లు వసూలు చేసింది. వంద కోట్ల డాలర్లు వసూలు చేసిన ఈ ఏడాది తొలి సినిమాగా స్పైడర్ మ్యాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2021లో అత్యదిక కలెక్షన్లు సంపాదించిన టైటిల్ ఈ సినిమా అందుకుంది. కొరియా యుద్ధ నేపథ్యంలో వచ్చిన ది బ్యాటిల్ ఆఫ్ లేక్ చాంగ్ జిన్ కలెక్షన్లను కూడా స్పైడర్ మ్యాన్ దాటేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 905 మిలియన్ల డాలర్లు వచ్చాయి. దీంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డ్స్ సృష్టిస్తున్న సినిమాగా స్పైడర్ మ్యాన్ నిలిచింది. గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ కోలుకుంటుంది. ఆర్థికంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఇప్పుడిప్పుడే విడుదలవుతున్న చిత్రాలు తిరిగి కొత్త ఆశలను కల్పిస్తున్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.
Also Read: RRR Movie Pre Release Event Live: అంగరంగ వైభవంగా ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. లైవ్‌లో చూసేయ్యండి..
RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్..
RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్.. 2 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో..