Cinema: మరొకరిని బలి తీసుకున్న గుండెపోటు.. సెట్‌లోనే కుప్పకూలిన అసిస్టెంట్ డైరెక్టర్
గుండె పోటు.. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది మహమ్మారి. మారిన జీవన శైలి లేదా మరే కారణమో తెలియదు కానీ సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ గుండె పోటుకు బలవుతున్నారు. తాజాగా మరో సినీ ప్రముఖుడు గుండె పోటుతో కుప్పకూలాడు.

సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో ప్రముఖ అసిస్టెంట్ సినిమా షూటింగ్ లోనే కుప్పకూలారు. చిత్ర బృందం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ కుటుంబ సభ్యులతో పాటు చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.అతని మృతికి నివాళిగా షూటింగ్ ను నిలిపేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అసిస్టెంట్ డైరెక్టర్ కు నివాళి అర్పిస్తున్నారు. 47 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన ఆ హాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు డియోగో బోరెల్లా. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఎమిలీ ఇన్ పారిస్ వెబ్ సిరీస్ ఐదో సీజన్‌కు డియోగో బోరెల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ ఇటలీలోని వెనిస్ నగరంలో జరుగుతోంది. అయితే గురువారం (ఆగస్టు 21) సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డియోగో బోరెల్లా ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. షూటింగ్ సెట్‌లోని వైద్య సిబ్బంది అతనిని బతికించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ మృతితో తాత్కాలికంగా షూటింగ్‌ను నిలిపేశారు.
‘ఎమిలీ ఇన్ పారిస్’ సీజన్ -5 డిసెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సోమవారం ( ఆగస్టు 25) నాటికి షూటింగ్ ముగియాల్సి ఉందని, చివరి సన్నివేశాన్ని బోరెల్లా పర్యవేక్షిస్తున్నారని వార్తా సంస్థలు నివేదించాయి. బోరెల్లా వెనిస్‌లో జన్మించాడు. సినిమాలతో పాటు టీవీ రంగాల్లోనూ వివిధ హోదాల్లో పని చేశాడు. ఇటలీకి రాక ముందు అతని కెరీర్ రోమ్, లండన్, న్యూయార్క్ లలో చాలా రోజుల పాటు నివసించాడు. కవిత్వం, అద్భుత కథలు, ముఖ్యంగా పిల్లల కోసం కథలు రాయడంలో బోరెల్లాకు మంచి ప్రావీణ్యముంది.
🚨 Tragedia en el set de Emily in Paris 💔🇮🇹
Diego Borella, asistente de dirección, falleció tras sufrir un presunto infarto mientras se filmaba la 5ª temporada de la exitosa serie de Netflix en Venecia.
Según medios italianos, Borella colapsó el viernes alrededor de las 7:00… pic.twitter.com/2c5ac6ked2
— Juan Espinoza (@EnCelebridades) August 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








